నాలుగు గంటల ఉత్కంఠకు తెర

నాలుగు గంటల ఉత్కంఠకు తెర
x
Highlights

లిఫ్ట్‌లో చిక్కుకున్న మూడేళ్ల బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. లిఫ్ట్‌లో చిక్కుకున్న బాలుడిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, 108 సిబ్బంది 4గంటలపాటు...

లిఫ్ట్‌లో చిక్కుకున్న మూడేళ్ల బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. లిఫ్ట్‌లో చిక్కుకున్న బాలుడిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, 108 సిబ్బంది 4గంటలపాటు శ్రమించి బయటకు తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చందానగర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని రాజీవ్ స్వగృహ అపార్టుమెంట్‌లో నివాసముండే ఫణీంద్రచారి కుమారుడు సార్యన్ ఆడుకుంటూ లిఫ్ట్‌లో ఎక్కాడు. పైవరకూ వెళ్లిన లిఫ్ట్ సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. దీంతో సౌర్యన్ కేకలు పెట్టడంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు గంటసేపు పైగా లిఫ్ట్ తెరిచే ప్రయత్నం చేశారు. ఫలితం లేకపోవడంతో ఫైర్ సిబ్బంది, పోలీసులు, 108 సిబ్బందికి సమాచారం అందించారు. బాలుడిని సురక్షితంగా బయటకు తీయడంతో కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 4గంటలుగా శ్రమించిన ఫైర్ సిబ్బంది, పోలీసులు, 108 సిబ్బంది లిఫ్ట్ గోడలు పగలగొట్టి బాలుడిని కాపాడటంతో ఈ ఉత్కంఠకు తెరపడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories