అన్న కాదు మృగం.. సొంత చెల్లెలిపై అన్న అఘాయిత్యం.. అవమానం భరించ లేక..

అన్న కాదు మృగం.. సొంత చెల్లెలిపై అన్న అఘాయిత్యం.. అవమానం భరించ లేక..
x
Highlights

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వావివరుసలు మరిచిన ఓ కామాందుడు సొంత చెల్లెలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పాల్వంచ పట్టణం జ్యోతీ...

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వావివరుసలు మరిచిన ఓ కామాందుడు సొంత చెల్లెలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పాల్వంచ పట్టణం జ్యోతీ నగర్ వెలుగుచూసిన ఘటనతో అవమానం భరించ లేక బాధితురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక తల్లిదండ్రులు భూపాలపల్లిలో ఓ వివాహ కార్యక్రమానికి వెళుతు..బాధితురాలితో పాటు అమె అన్నను ఇంట్లో ఉంచారు. సోదరుడు రాంబాబు స్నేహితుడితో కలిసి బలత్కారానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.

అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. రాంబాబుతోపాటు అతని స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్భయ లాంటి ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకువచ్చినా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories