బ్యాగ్‌లో ఆడపిల్లను తీసుకొచ్చిన జంట...గుడిలో బ్యాగ్ వదిలేసి...

Child
x
Child
Highlights

ప్రపంచం మారింది. ప్రతి రంగంలో మగవాళ్లతో ఆడవాళ్లు పోటీ పడుతున్నారు. కానీ, భారతదేశంలో మాత్రం మహిళల పట్ల ఇంకా వివక్ష కొనసాగుతోంది.

ప్రపంచం మారింది. ప్రతి రంగంలో మగవాళ్లతో ఆడవాళ్లు పోటీ పడుతున్నారు. కానీ, భారతదేశంలో మాత్రం మహిళల పట్ల ఇంకా వివక్ష కొనసాగుతోంది. కొంతమంది తల్లిదండ్రులు ఆడ పిల్లలు పుట్టిన వెంటనే వదిలేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి వేళ ముఖానికి ముసుగు వేసుకుని వస్తున్న వీరు దంపతులు. భర్త చేతుల్లో బ్యాగు మోసుకొస్తున్నాడు. భార్యభర్తలు ఓ ఆలయం వద్దకు చేరుకున్నారు.

గుడిలోని మెట్ల వద్ద బ్యాగు పెట్టి భర్త కూర్చోగా, భార్య నిల్చుంది. దంపతులిద్దరూ అటూ ఇటూ చూస్తున్నారు. కాసేపటి తర్వాత భార్యభర్తలు ఇంటి ముఖం పట్టారు. కానీ, ఆలయానికి వచ్చేటప్పుడు భర్త చేతుల్లోనున్న బ్యాగ్ వచ్చేటప్పుడు లేదు. ఈ దంపతులు తాము తెచ్చిన బ్యాగును ఆలయంలో వదిలేశారు. ఆ బ్యాగులో ఆడపిల్ల ఉంది. భవిష్యత్ లో ఎక్కడ తమకు భారం అవుతుందోనన్న భయంతో పాపను ఓ బ్యాగులో తీసుకొచ్చి గుడిలో వదిలేశారు. ఈ విదారకర సంఘటన మధ్యప్రదేశ్‌ లోని తికంగర్ లో జరిగింది. సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories