logo

మద్యం మత్తులో గొంతు కోసుకున్నాడు...

మద్యం మత్తులో గొంతు కోసుకున్నాడు...
Highlights

మద్యం మత్తులో ఓ యువకుడు గొంతుకోసుకున్న ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే పోలీసులు...

మద్యం మత్తులో ఓ యువకుడు గొంతుకోసుకున్న ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లాలోని హాలియా అనే పట్టణంలో లింగాల శ్రీను అనే వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు. ఆమె తల్లి చిన్నగా హోటల్ నడుపుతుంది. మధ్య కోసం ఎప్పుడు శ్రీను తన తల్లిని డబ్బులు ఇవ్వాలని వేధించేవాడు.

ఇదే క్రమంలో ఈ రోజు (మంగళవారం) కూడా మద్యం సేవించేందుకు డబ్బులు కావాలని కోరాడు. కానీ దానికి తన తల్లి నిరాకరించడంతో ఆవేశంలో మద్యం సీసాని పగలగొట్టి గొంతు కోసుకున్నాడు. దీనితో స్థానికులు వెంటనే 108 కి ఫోన్ చేసి ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతడి పరిస్థతి విషయంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.


లైవ్ టీవి


Share it
Top