వర్షిత కేసు : నిందితుడి ఊహాచిత్రం విడుదల

వర్షిత కేసు : నిందితుడి ఊహాచిత్రం విడుదల
x
Highlights

చిత్తూరు జిల్లా ముదివేడు ఘటనలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. సీఎం ఈ కేసుపై స్పందించడంతో ప్రతి అనుమానితుడిని విడిచిపెట్టకుండా...

చిత్తూరు జిల్లా ముదివేడు ఘటనలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. సీఎం ఈ కేసుపై స్పందించడంతో ప్రతి అనుమానితుడిని విడిచిపెట్టకుండా విచారిస్తున్నారు. వర్షిణితో చనువుగా ఉంటూ సెల్ ఫోన్లో సెల్ఫీ తీసుకుంటూ ట్రాప్ చేస్తున్న వ్యక్తిగా అనుమానిస్తున్న ఓ వ్యక్తిని సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. అతడి ఊహా చిత్రాన్ని విడుదల చేశారు.

చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గుట్టపాళ్యంకు చెందిన ఐదేళ్ల చిన్నారి వర్షితపై అత్యాచారం, హత్య ఘటనలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు పోలీసులు సీరియస్ గా నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారు. అన్ని శాఖలకు సంబంధించి 20 టీమ్‌లు వర్క్ చేస్తున్నాయి.

ఫంక్షన్‌ హాల్‌లోని సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు విచారిస్తున్నారు. ఈకేసులో అనుమానితుడిగా భావిస్తూ ఓ వ్యక్తిని పెద్దతిప్ప సముద్రంలో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. వర్షిణితో చనువుగా ఉంటూ సెల్ ఫోన్లో సెల్ఫీ తీసుకుంటూ ట్రాప్ చేస్తున్న వ్యక్తిగా అనుమానిస్తున్న ఓ వ్యక్తిని సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. అతడి ఊహా చిత్రాన్ని విడుదల చేశారు. ఈ కేసుపై సీఎం జగన్ సీరియస్ గా స్పందించడంతో ప్రతి అనుమానితుడిని విడిచిపెట్టకుండా పోలీసులు విచారిస్తున్నారు. త్వరలో నిందితులను అరెస్ట్ చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories