logo

డాక్టర్ కం నకిలీ పోలిస్ ... ఒంటరి యువతులే అతని టార్గెట్

డాక్టర్ కం నకిలీ పోలిస్ ... ఒంటరి యువతులే అతని టార్గెట్
Highlights

ఒంటరి యువతులే అతని టార్గెట్.. ఒంటరిగా ప్రేమ జంట కనిపిస్తే ఇక అంతే. పొలీస్ అంటూ మాయమాటలు చెప్పి యువతులపై...

ఒంటరి యువతులే అతని టార్గెట్.. ఒంటరిగా ప్రేమ జంట కనిపిస్తే ఇక అంతే. పొలీస్ అంటూ మాయమాటలు చెప్పి యువతులపై అత్యాచారం చేస్తాడు . ఇలా కొన్ని రోజులు అతను ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా సాగింది . చివరికి విషయం గుట్టు రట్టు అవడంతో ఇప్పుడు పోలిసుల చేతుల్లో కటకటాలు లేక్కబెడుతున్నాడు .

ఇక వివరాల్లోకి వెళ్తే గొల్ల శంకరయ్య అనే వ్యక్తి మెదక్ జిల్లాలోని కంది మండలం కలివేముల గ్రామంలో ఆర్ఎంపీ గా పనిచేస్తున్నాడు . మంచి వృత్తిలో ఉండి నీచమైన పనులకు అలవాటు పడ్డాడు . డాక్టర్ అని చెప్పుకుంటూనే ఒంటరిగా యువతులు మరియు ప్రేమ జంటలు కనిపిస్తే పోలీస్ అంటూ కొత్త అవతారం ఎత్తి వాళ్ళపై అత్యాచారం చేసేవాడు . ఇదే క్రమంలో గత నెల జూలై 26న ఓ యువతి తన స్నేహితుడితో కలిసి ఓడీఎఫ్ ఎస్టేట్‌కు వెళ్లే దారిలోని కందిగేటు దగ్గర ఉండగా గొల్ల శంకరయ్య గమనించాడు. పోలీస్‌నంటూ బెదిరించి.. మీకు ఇక్కడేం పని అని వారిని నిలదీశాడు.

అంతేకాకుండా అ యువతీ స్నేహితుడిని కొట్టాడు . ఇలా ఇద్దరినీ తన పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తాను అంటూ బైక్ పై ఎక్కించుకున్నాడు . ఇలా నిజాంపూర్ శివారులో అ యువతీ పై అత్యాచారం చేసి చివరకు రాత్రి 9 గంటల సమయంలో వారిని సదాశివపేటలో వదిలిపెట్టాడు. అయితే దీనిపైన అ యువతీ పోలిస్ స్టేషన్ లో కంప్లేంట్ చేయగా పోలీసులు అతని కోసం పెద్ద వల వేసి పట్టుకున్నారు.. గతంలో కూడా గొల్ల శంకరయ్య ఇలాంటి నేరాలకు పాల్పడ్డాడు . కానీ పరువుకోసం బయపడి ఎవరు కంప్లేంట్ చేయలేకపోయారు .


లైవ్ టీవి


Share it
Top