ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు .. ఫేస్ బుక్ లో భార్య నగ్న ఫోటోలు పెట్టాడు..

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు .. ఫేస్ బుక్ లో భార్య నగ్న ఫోటోలు పెట్టాడు..
x
Highlights

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . భార్యతో చక్కగా సంసారం చేసుకోవాల్సింది పోయి తన భార్య ఫోటోలను నగ్నంగా మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్ ఖాతాలో పెట్టాడు .. విషయం...

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . భార్యతో చక్కగా సంసారం చేసుకోవాల్సింది పోయి తన భార్య ఫోటోలను నగ్నంగా మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్ ఖాతాలో పెట్టాడు .. విషయం తెలుసుకున్న అతని భార్య రాచకొండ పోలీసులను ఆశ్రయించింది . దీనితో ఇప్పుడు కటకటాలు లేక్కబెడుతున్నాడు . ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం, కల్వకొలె గ్రామానికి చెందిన రవీందర్ ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు . అతనికి అక్కడే మరో యువతీతో పరిచయం ఏర్పడింది . అ పరిచయం కాస్తా ప్రేమగా మారింది . అయితే కొన్నిరోజులకు ఆమె మరొక చోట ఉద్యోగం చేస్తూ తన సోదరుడితో కలిసి ఓ కాలనీలో అద్దెకు ఉంటుంది . ఈ క్రమంలో రవీందర్ కూడా అ యువతి దగ్గరికి వెళ్లి ఉన్నాడు . ఇద్దరు కలిసి ఓ గుడిలో పెళ్లి చేసుకున్నాడు .

ఇలా కొన్ని రోజులు వీరిద్దరి కాపురం సజావుగానే సాగింది . కానీ రవీందర్ ఫేస్ బుక్ ఖాతాలో చాలా మంది అమ్మాయలు ఉండడం గమనించిన రవీందర్ భార్య అతన్ని నిలదీసింది .ఇలా వారి మధ్య మనస్పర్ధలు రావడంతో అవి కాస్తా గొడవలుగా మారాయి . దీనితో రవీందర్ భార్య అతన్ని వదిలేసి తన సొంత గ్రామానికి వెళ్ళిపోయింది . ఈ క్రమంలో ఆమెపై పగ పెంచుకున్న రవీందర్ ఆమె పేరుతో ఓ ఫేస్ బుక్ ఖాతా తెరిచి ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలుగా చిత్రీకరించి ఆమెను ఓ కాల్ గర్ల్ గా సృష్టంచి అ ఖాతాలో పోస్ట్ చేసాడు . దీనితో విషయం తెలుసుకున్నా భాదితురాలు పోలీసులను ఆశ్రయించింది . పోలీసులు అతన్ని విచారించగా నిజం ఒప్పుకోవడంతో అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories