logo

తండ్రితో భార్య అక్రమ సంబంధం..ఇద్దర్నీ చంపేసిన భర్త!

తండ్రితో భార్య అక్రమ సంబంధం..ఇద్దర్నీ చంపేసిన భర్త!
Highlights

విలువలు దిగజారిపోతున్నాయి. ముఖ్యంగా మానవ సంబంధాలు మంతగాలిసిపోతున్నాయి. శృంగార పరమైన విపరీత ధోరణులు వెర్రితలలు...

విలువలు దిగజారిపోతున్నాయి. ముఖ్యంగా మానవ సంబంధాలు మంతగాలిసిపోతున్నాయి. శృంగార పరమైన విపరీత ధోరణులు వెర్రితలలు వేస్తున్నాయి. ఈ క్రమంలో వావి వరుసలు వదిలేస్తున్నారు. ఈ ధోరణి సమాజంలో మారణహోమాన్ని రగిలిస్తోంది.

కోడల్ని కన్నబిడ్డలా చూసుకోవాల్సిన వాడు ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దాంతో అతని కొడుకు ఇద్దర్నీ హతమార్చాడు. దారుణమైన ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. అక్కడి విజయపురం జిల్లాలోని ఇండి తాలూకా ఖేడగి గ్రామంలో పుట్టప్ప అనే వ్యక్తి భార్య రేణుక(35), తండ్రి మాళప్పతో కలిసి ఉంటున్నాడు. వ్యవసాయ పనులు నిమిత్తం పుట్టప్ప రోజూ ఉదయం వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేవాడు. ఇంట్లో ఇద్దరే ఉండటంతో రేణుక, మాళప్ప మధ్య అక్రమ సంబంధానికి దారితీసింది. శనివారం మధ్యాహ్నమే ఇంటికి వచ్చిన పుట్టప్ప గదిలో తన భార్య, తండ్రి అసభ్యరీతిలో ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయాడు.

కోపం పట్టలేని పుట్టప్ప కత్తితో మొదట భార్యను వేటు వేశాడు. తరువాత కన్నా తండ్రిని కూడా కత్తితో పొడిచి చంపేశాడు. అటు తర్వాత అక్కడ నుంచి పారిపోయాడు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ హత్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



లైవ్ టీవి


Share it
Top