logo

నాలుగు నెలలు వెంటపడ్డాడు... నాలుగు నిమిషాల్లో పెళ్లి చేసుకున్నాడు.. నాలుగు గంటల సమయంలో పారిపోయాడు..

నాలుగు నెలలు వెంటపడ్డాడు... నాలుగు నిమిషాల్లో పెళ్లి చేసుకున్నాడు.. నాలుగు గంటల సమయంలో పారిపోయాడు..
Highlights

అమ్మాయిని ప్రేమించా అన్నాడు. ఓ నాలుగు నెలలుగా వెంటబడ్డాడు. ఓ రాత్రి పెళ్లి కూడా చేసుకున్నాడు ఉదయాన్నే...

అమ్మాయిని ప్రేమించా అన్నాడు. ఓ నాలుగు నెలలుగా వెంటబడ్డాడు. ఓ రాత్రి పెళ్లి కూడా చేసుకున్నాడు ఉదయాన్నే పారిపోయాడు. దీనితో ఆ అమ్మాయి చేసేది ఏమిలేకా విషయం మొత్తం తన తల్లితండ్రులకి చెప్పి పోలిస్ స్టేషన్ లో కంప్లేంట్ చేసింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికంగా ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ బాలిక రోజు సైకిల్ పై కాలేజికి వెళ్తుంది. ఇది గమంచిన ఓ యువకుడు ఆమెను ప్రేమిస్తున్నానని ఓ నాలుగు నెలలు వెంటపడ్డాడు. చివరికి ఆ అమ్మాయి కూడా అతడి ప్రేమకి పచ్చ జెండా ఉపేసింది. అయితే గురువారం రాత్రి ఆ అమ్మాయి తన తాతతో మాత్రమే ఉందని తెలుసుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని కొండపైన ఉన్న అమ్మవారి గుడికి తీసుకువెళ్ళి అక్కడ తాళి కట్టాడు ఆ యువకుడు . రాత్రంతా అక్కడే గడిపి ఉదయాన్నే తనని వెళ్లిపోయాడని భాదితురాలు పోలీసులు ముందు వాపోయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


లైవ్ టీవి


Share it
Top