logo

ఒంగోలు నగరంలో దారుణం: భార్యపై అనుమానంతో హత్యాయత్నం

ఒంగోలు నగరంలో దారుణం:  భార్యపై అనుమానంతో హత్యాయత్నం
Highlights

ఒంగోలు నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒంగోలు వీఐపీ రోడ్‌లో భార్యపై అనుమానంతో ఓ భర్త హత్యాయత్నానికి...

ఒంగోలు నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒంగోలు వీఐపీ రోడ్‌లో భార్యపై అనుమానంతో ఓ భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బొర్రా సుబ్రమణ్యం అనే వ్యక్తి తన భార్య పనిచేస్తున్న జనరిక్‌ మెడికల్‌ షాప్‌లోకి దూసుకెళ్లి కూరగాయలు కోసే కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అనంతరం అతడూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా ప్రతిఘటించిన ఆమె కేకలు వేయడంతో స్థానికులు వచ్చి ఆమెను రక్షించారు. ఈ ఘటనలో ఆమెకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తన భార్య జ్యోతిపై అనుమానంతోనే ఈ ఆఘాయిత్యానికి పాల్పడినట్లు విచారణలో నిందితుడు అంగీకరించనట్లు పోలీసులు తెలిపారు. బాధితులు ప్రస్తుతం ఒంగోలులోని ఒక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతోంది.

లైవ్ టీవి

Share it
Top