కేసు నమొదు : గన్ తో బెదిరించి కోడలిపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే అత్యాచారం..

కేసు నమొదు : గన్ తో బెదిరించి కోడలిపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే అత్యాచారం..
x
Highlights

బీజేపి మాజీ ఎమ్మెల్యే మనోజ్ షోకీన్‌పై ఆమె కోడలు ఆరోపణలు చేసారు . తనని తుపాకీతో బెదిరించి అత్యాచారం చేసాడని ఆమె తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు...

బీజేపి మాజీ ఎమ్మెల్యే మనోజ్ షోకీన్‌పై ఆమె కోడలు ఆరోపణలు చేసారు . తనని తుపాకీతో బెదిరించి అత్యాచారం చేసాడని ఆమె తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు . గతేడాది డిసెంబరు 31 అర్ధరాత్రి తర్వాత అతడు తనపై అత్యాచారం చేశాడని ఆమె పోలీసులకు తెలిపారు. మనోజ్ షోకీన్‌ ఢిల్లీకి చెందినా బీజేపి నేత .. అయన నంగ్లోయ్‌, ముంద్కా నియోజకవర్గాల నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే భాదితురాలు చెప్పిన వివరాల ప్రకారం తన భర్త డిసెంబర్ 31 అర్ధరాత్రి 12.30 గంటలకు ఇంట్లో దిగబెట్టి బయటకు వెళ్లిపోయాడని చెప్పాడు ,

అదే రోజు అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో తన మామ అయిన మనోజ్ షోకీన్‌ తన గది తలుపు కొట్టి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది . మద్యంలో ఉన్న మనోజ్ షోకీన్‌ తనని తన రూమ్ కి వెళ్లి పడుకోవాల్సిందిగా లేని పక్షంలో తన సోదరున్ని తానూ తెచ్చుకున్న గన్ తో చంపేస్తానని బెదిరించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది . అయితే తన కుటుంబ పరువు నేపధ్యంలో విషయం ఎవరికీ చెప్పలేదని ఆమె చెప్పుకొచ్చింది . ఆమె ఫిర్యాదు మేరకు అత్యాచారం, గృహ హింస నేరారోపణలపై మనోజ్ షోకీన్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories