logo

రెచ్చిపోయిన ప్రేమోన్మాది... ప్రియురాలుపై దాడి

రెచ్చిపోయిన ప్రేమోన్మాది... ప్రియురాలుపై దాడి
Highlights

ప్రేమించిన అమ్మాయిపై అనుమానం పెరగడంతో ఓ ఉన్మాది ఆమెపై కత్తితో దాడి చేసాడు . ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది .

ప్రేమించిన అమ్మాయిపై అనుమానం పెరగడంతో ఓ ఉన్మాది ఆమెపై కత్తితో దాడి చేసాడు . ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది . ఇక వివరాల్లోకి వెళ్తే భీమునిగుమ్మం ప్రాంతానికి చెందిన నాగసాయి,యశోద భార్గవి ఇద్దరు ప్రేమించుకున్నారు . వీరి ప్రేమకి కూడా వారి పెద్దలు ఒప్పుకున్నారు. అంతా బాగానే ఉంది అనుకున్నా క్రమంలో నాగసాయికి యశోద భార్గవిపై అనుమానం కలగడంతో కళాశాల నుండి ఇంటికి వస్తున్న సమయంలో ఆమె మెడ పొట్ట భాగాల్లో కత్తితో దాడి చేసాడు . అయితే ఇదంతా చూసిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించగా ఆమెకి ప్రాణాపాయం లేదని తేల్చారు. ఇక నాగసాయికి స్థానికులు దేహశుద్ది చేసారు .


లైవ్ టీవి


Share it
Top