ఆటోడ్రైవర్ అసభ్య ప్రవర్తన... కేసు పెట్టిన యువతి

ఆటోడ్రైవర్ అసభ్య ప్రవర్తన... కేసు పెట్టిన యువతి
x
Highlights

ఓ ఆటో డ్రైవర్ తన ప్రయాణికురాలి దగ్గర అసభ్యంగా ప్రవర్తించాడు .దీనితో ఆమె తన తల్లితో కలిసి పోలిస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడంతో అతన్ని పోలీసులు అరెస్ట్...

ఓ ఆటో డ్రైవర్ తన ప్రయాణికురాలి దగ్గర అసభ్యంగా ప్రవర్తించాడు .దీనితో ఆమె తన తల్లితో కలిసి పోలిస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసారు . ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది . ఇక వివరాల్లోకి వెళ్తే ఈ నెల 1వ తేదీన ముంబయిలోని న్యూ లింక్ రోడ్‌ చించోలి బందర్ బస్‌స్టాప్ వద్ద ఓ యువతి ఆటోలో ఎక్కింది . ఇలా సగం దూరం ప్రయాణం చేసాక సదరు ఆటో డ్రైవర్ తన ఆటో ఆపి అ యువతి ఎదుట అసభ్యంగా ప్రవర్తించాడు. అనంతరం యువతిని తన గమ్యానికి చేర్చాడు . అయితే ఈ విషయాన్ని మొత్తం తన తల్లికి చెప్పడంతో వారు పోలీసులని ఆశ్రయించారు . పోలీసులు కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేసాడు . గతంలో కూడా ఈ ఆటో డ్రైవర్ మహిళలను వేధించి పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నట్టు పోలీసులు చెప్పుకొచ్చారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories