Top
logo

ఆవనిగడ్డలో దారుణం..మూడోతరగతి బాలుడి దారుణ హత్య

ఆవనిగడ్డలో దారుణం..మూడోతరగతి బాలుడి దారుణ హత్య
Highlights

కృష్ణా జిల్లా అవనిగడ్డలో దారుణం జరిగింది. చల్లపల్లి‌ బీసీహాస్టల్‌లో బాలుడు దారుణహత్యకు గురయ్యాడు. మూడో...

కృష్ణా జిల్లా అవనిగడ్డలో దారుణం జరిగింది. చల్లపల్లి‌ బీసీహాస్టల్‌లో బాలుడు దారుణహత్యకు గురయ్యాడు. మూడో తరగతి చదువుతోన్న ఆదిత్యను గుర్తుతెలియని వ్యక్తులు అతికిరాతకంగా గొంతుకోసి చంపేశారు. బాత్‌రూంలో రక్తం మడుగులో కనిపించడంతో స్థానికంగా కలకలం రేపుతోంది. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటినా హాస్టల్‌కు చేరుకొని కన్నీరుమున్నీరవుతున్నారు. గొంతు కింద కోసి ఉండడంతో ఆదిత్యను ఎవరో హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. హాస్టల్‌ వార్డెన్‌తో పాటు తోటి విద్యార్థులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే హత్యకు గల కారణాలు తెలియరాలేదు.
Next Story


లైవ్ టీవి