బాబోయ్! ఆ నాయకుడి దగ్గర ఎంత బంగారమో .. అంతా లంచం సొమ్మే!

బాబోయ్! ఆ నాయకుడి దగ్గర  ఎంత బంగారమో .. అంతా లంచం సొమ్మే!
x
Highlights

ఏసీబీ కి చిక్కిన అవినీతి తిమింగలం.. పది కోట్లు స్వాధీనం. అవినీతి జలగ పది కిలోల బంగారంతో చిక్కింది. అవినీతికి కొత్త అర్థం లక్షలాది రూపాయల భూములు తన...

ఏసీబీ కి చిక్కిన అవినీతి తిమింగలం.. పది కోట్లు స్వాధీనం. అవినీతి జలగ పది కిలోల బంగారంతో చిక్కింది. అవినీతికి కొత్త అర్థం లక్షలాది రూపాయల భూములు తన పేరున రాయించుకున్న ఘనుడు. ఇలాంటి శీర్షికలతో ఎన్నో వార్తలు రోజూ శూస్తుంటాం. ఇటువంటి అవినీతి రాజులకు రారాజు కాదు కాదు చక్రవర్తి గురించి మీఇకిప్పుడు చెప్పబోతున్నాం. ఇతడి అవినీతి గురించి మీకు తెలిస్తే వామ్మో అని సింపుల్ గా అనరు. గుండెలు అదిరిపోవడం ఖాయం. సరే ఇక అసలు విషయం చెప్పేస్తాను.

ఇది చైనా లోని అవినీతి కుబేరుడి కథ. చైనాలో కమ్యూనిస్టు పాలన ఉంది. అక్కడ అంతా నిజాయతీగా ఉంటుంది అని మీరనుకుంటే పప్పులో కాలేసినట్టే. అక్కడా మనకులానే అవినీతి.. ఇంకా అటువంటి జాడ్యాలు చాలానే ఉంటాయి. అందులోనూ అధికారంలో ఒకే పార్టీ దశాబ్దాలుగా అక్కడ ఉంది. ఆ పార్టీకి చెందిన నాయకులు కూడా అప్పటి నుంచి ఇదే పరిస్థితిలో ఉన్నారు. దీంతో అవినీతిపై ఉక్కుపాదం మోపాలని ఆ దేశాధ్యక్షుడు జిన్ పింగ్ నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇటీవల నాయకులకు సంబంధించిన ఆస్తులపై అవినీతి నిరోధక అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో భాగంగా అక్కడి హైనాన్ ఫ్రయావిన్స్ రాజధాని హైకోర్ అనే ప్రాంతానికి మేయర్ గా గతంలో సేవలందించిన జాన్ క్వీఆస్తులపై దాడులు చేశారు.

ఈ దాడులు నిర్వహించిన అధికారులు కళ్ళు తిరిగి కింద పడిపోయారు. ఎందుకంటే.. ఈ నాయకుడి ఇంట్లో.. దొరికిన బంగారం కేజీల్లో కాదు టన్నుల్లో.. 13 . 5 టన్నుల బంగారం దొరికింది. దీని విలువ మార్కెట్ రేటు ప్రకారం రెండు లక్షల అరవైఎనిమిది కోట్లు. అంటే మన రాష్ట్ర రెండు బడ్జెట్లు. ఇదే కాదు అయ్యగారి దగ్గర సొమ్ములూ దొరికాయి. వాటి విలువ కూడా లక్షల కోట్లే అట. ఇంతేనా ఈయన గారు ఈ సొమ్ము తో పాటు ఖరీదైన విల్లాలు కూడా లంచాలుగా పుచ్చుకున్నట్టు అధికారులకు తెలిసింది. ఈయన లంచం సొమ్మంతా కలిపితే చైనా వ్యాపార దిగ్గజం, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా ఆస్తుల కంటే కూడా చాలా ఎక్కువ అని తేల్చారు. ఇప్పుడు ఈయన గారిని కటకటాల్లో పెట్టారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఈ దర్యాప్తులో జాన్ క్వీ లంచం తీసుకున్నట్టు రుజువైతే, మరణ శిక్ష విధించే అవకాశం ఉంది.

లంచాలు.. దొంగతనాలు.. అవినీతి ఇవన్నీ చైనా లోనూ మన దేశంలోనూ సేమ్ తో సేమ్.. కాకపొతే శిక్షలే.. ఇదొక్కటే తేడాయే.. అక్కడ లంచం..అవినీతికి శిక్ష మరణమే!


!


Show Full Article
Print Article
More On
Next Story
More Stories