వైసీపీలో ఏం జరుగుతోంది...కలసి పనిచేసేది లేదంటున్న...

x
Highlights

ముందస్తు ఊహాగానాలతో ఫ్యాన్ స్పీడ్ పెరిగిపోతోంది. అధినేత పాదయాత్రలతో హల్ చల్ చేస్తుంటే ఫ్యాన్ గాలికి ఆకర్షితులై చేరికలూ ఎక్కువవుతున్నాయి. మాజీ...

ముందస్తు ఊహాగానాలతో ఫ్యాన్ స్పీడ్ పెరిగిపోతోంది. అధినేత పాదయాత్రలతో హల్ చల్ చేస్తుంటే ఫ్యాన్ గాలికి ఆకర్షితులై చేరికలూ ఎక్కువవుతున్నాయి. మాజీ మంత్రులు, సీనియర్లు ఇప్పుడు ఫ్యాన్ గాలికి ఫిదా అవుతున్నారు అయితే ఇప్పటికే ఫ్యాన్ గూట్లో ఉన్న వారు మాత్రం కాస్త ఇబ్బంది పడుతున్నారు.. అసలు వైసిపిలో ఏం జరుగుతోంది?

ఏపిలో రాజకీయం రంజుగా మారుతోంది. ముందస్తు ఎన్నికల ఊహాగానాలతో పార్టీలు ఎలర్ట్ అవుతున్నాయి ఉన్న పార్టీలో టిక్కెట్ రాకపోతే పక్క పార్టీలో కండువా పరిచేస్తున్నారు ఉన్న చోట గుర్తింపు తగ్గితే పక్క పార్టీలోకి జంప్ అయిపోవాలని చూస్తున్నారు.. వైసిపికి ఈ తరహా నేతల తాకిడి ఎక్కువైంది. అయితే కొత్త వారి రాకతో అప్పటి వరకూ ఆ నియోజక వర్గం కోసం కష్టపడి పనిచేసిన వారు గొల్లుమంటున్నారు. కొత్త వారితో కలసి పనిచేసేది లేదని మొండికేస్తున్నారు నెల్లూరు,ప్రకాశం ఈ రెండు జిల్లాల్లోనూ వైసిపిలో ఇదే సమస్య ఎదురవుతోంది.

నెల్లూరులో కాంగ్రెస్, టిడిపిల నుంచి కీలక నేతలు వైసిపిలో చేరేందుకు సిద్ధపడుతున్నారు. నెల్లూరు జిల్లాలో టిడిపి నేత ఆనం రామనారాయణ్ రెడ్డి వైసిపిలో చేరేందుకు ఇప్పటికే జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే పార్టీలో సీనియర్ నేతగా ఉన్న మేకపాటి వర్గం ఆనం రాకను వ్యతిరేకిస్తోంది. వైసిపి ఆరంభం నుంచి వెన్నంటి ఉన్న మేకపాటి వర్గానికి ఆనం రాక ఇష్టం లేదు. మరోవైపు ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి మహిధర్ రెడ్డి బుధవారం వైసిపి తీర్ధం పుచ్చుకోనున్నారు. అయితే అక్కడ ప్రస్తుతం ఇన్ ఛార్జ్ గా ఉన్న మాధవరావు మహీధర్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు..ప్రస్తుతం తూర్పు గోదావరిలో ఉన్న జగన్ విశాఖ చేరుకున్న తర్వాత టిడిపి ఎంపి అవంతి శ్రీనివాసరావు కూడా వైసిపి గూటికి వస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇలా వివిధ పార్టీలకు చెందిన ముఖ్యనేతలు వైసిపిలో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్నారు.

గత ఎన్నికలలో ఓటమి నేర్పిన పాఠాలను దృష్టిలో పెట్టుకుని మరొకసారి ఆ పొరపాటు జరగకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు జగన్. ఇందులో భాగంగా పాదయాత్రలో ఇతర పార్టీలనుంచి ప్రజాదరణ కలిగిన నేతలతో భేటీ అవుతూ వారిని తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. చేరికలు బానే ఉన్నాయి కానీ మొదట్నుంచీ పార్టీనే నమ్ముకుని కష్టపడి పనిచేసిన వారి పరిస్థితి ఏంటి? వారి అభ్యంతరాలను జగన్ పరిశీలిస్తారా? దగ్గరుండి సమస్యను సామరస్య పూర్వకంగా సర్దుబాటు చేస్తారా? వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories