కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా వైయస్ఆర్ జయంతి వేడుకలు..

nanireddy
Updated on: 24 Dec 2018 1:56 PM IST
కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా వైయస్ఆర్ జయంతి వేడుకలు..
X

ఆదివారం గాంధీభవన్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ 69వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. ఈ సందర్బంగా టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేసి పేదల హృదయాల్లో చిరస్మరణీయ స్థానం సంపాదించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో తామందరం ముందుకెళతామని అన్నారు. అంతేకాకుండా వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారని అయన అన్నారు.. ఇక ఏపీ కాంగ్రెస్‌ కార్యాలయం ఇందిరాభవన్‌లో వైఎస్సార్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిం చారు. వైఎస్‌ చిత్రపటానికి ఎంపీ కేవీపీ రాంచందర్‌రావు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.

nanireddy

nanireddy

Next Story