నేడు వైయస్ జగన్ కీలక ప్రకటన..?

nanireddy
Updated on: 24 Dec 2018 2:02 PM IST
నేడు వైయస్ జగన్ కీలక ప్రకటన..?
X

వైసీపీ అధినేత వైయస్ జగన్ నేడు మీడియా సమావేశంలో పాల్గొననున్నారు. నిన్న(శుక్రవారం) పార్లమెంట్‌లో జరిగిన పరిణామాలపై శనివారం ఉదయం 8.30 గం.కు ప్రెస్‌మీట్‌లో స్పందిస్తానని వైఎస్‌ జగన్‌ తెలిపారు. కాగా ఏపీకి ప్రత్యేక హోదా కావాలని వైసీపీ ఎంపీలతో రాజీనామా చేయించిన పరిణామం, లోక్ సభ లో టీడీపీ ఎంపీలు మాట్లాడిన తీరుపై జగన్ స్పందించే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాకుండా ప్రత్యేక హోదా కోసం(అవిశ్వాస తీర్మానం, రాజీనామాలు) రెండు అస్త్రాలు పూర్తయిన నేపథ్యంలో జగన్ నేడు కీలక నిర్ణయం ప్రకటించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జగన్ తన ప్రజాసంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సాగితోంది.

nanireddy

nanireddy

Next Story