మా బిడ్డను బాగా చూసుకో అల్లుడూ : వైయస్ జగన్

nanireddy
Updated on: 24 Dec 2018 1:53 PM IST
మా బిడ్డను బాగా చూసుకో అల్లుడూ : వైయస్ జగన్
X

పాదయాత్రలో బిజీగా ఉన్న వైసీపీ అధినేత వైయస్ జగన్ నూతన జంటను ఆశీర్వదించారు. నెల్లూరు రురల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చిన్న కుమార్తె వైష్ణవి వివాహం నవీన్ రెడ్డి తో జరిగింది. పాదయాత్రలో ఉన్న జగన్ వీరి పెళ్లికి హాజరుకాలేక పోయారు. దాంతో నూతన దంపతులు రామ చంద్రాపురం నియోజకవర్గం, కోలంక లో జగన్ మోహన్ రెడ్డిని కలసి ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ సందర్బంగా 'మా బిడ్డను బాగా చూసుకో అల్లుడూ' అంటూ నవీన్ రెడ్డికి సూచించారు జగన్. కాగా ప్రస్తుతం జగన్ ప్రజాసంకల్ప యాత్ర రామచంద్రపురం నియోజక వర్గంలో జరుగుతోంది.

nanireddy

nanireddy

Next Story