ఆత్మీయుడిని కోల్పోయాం : వైయస్ భారతి

nanireddy
Updated on: 24 Dec 2018 1:30 PM IST
ఆత్మీయుడిని కోల్పోయాం : వైయస్ భారతి
X

వైయస్ఆర్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కన్వీనర్ డి.ఎ సోమయాజులు మరణంతో కుటుంబంలోని ఆత్మీయుడిని కోల్పోయామని జగన్ సతీమణి వైయస్ భారతి అన్నారు. ఆదివారం సోమయాజులు భౌతికకాయాన్ని సందర్శించిన ఆమె నివాళులు అర్పించారు. కాగా సోమయాజులు మృతిపై ప్రస్తుతం పచ్చిమగోధావరి పాదయాత్రలో ఉన్న జగన్ హుటాహుటిన హైదరాబాద్ చేరుకొని ఆయనకు నివాళులు అర్పించారు. ఆర్ధికరంగంలో నిష్ణాతులైన అయన 2004 - 09 మధ్యకాలంలో ఆ శాఖ సలహాదారులుగా వ్యవహరించారని ఆ సమయంలో ఆయన వద్ద చాలా నేర్చుకుననట్టు ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఐవైఆర్ కృష్ణరావు తెలిపారు. ప్రతి విషయంపై అవగాహన ఉన్నటువంటి మహోన్నత వ్యక్తి సోమయాజులని తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి ఆయనేనని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. కాగా సోమయాజులు మృతికి మాజీ ఎంపీ, బీజేపీ నేత కావూరి సాంబశివరావు ,ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నివాళులు అర్పించారు.

nanireddy

nanireddy

Next Story