సదర్ సంబరాలకు పట్నం తయార్...

x
Highlights

సంస్కృతిలో భాగమైన సదర్‌ ఉత్సవాలకు హైదరాబాద్ సిద్ధమైంది. ఏటా దీపావళి మరుసటి రోజున ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. యాదవుల...

సంస్కృతిలో భాగమైన సదర్‌ ఉత్సవాలకు హైదరాబాద్ సిద్ధమైంది. ఏటా దీపావళి మరుసటి రోజున ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. యాదవుల ఐక్యత, పాడిపంటలు, పశు సంపదకు నిదర్శనంగా సాగే ఈ సంబరం ఇవాళ, రేపు జరగనుంది. ఈ వేడుకల్లో బలిష్టమైన, శక్తివంతమైన దున్నలను ప్రదర్శించనున్నారు. సదర్‌ ఉత్సవాలకు భాగ్యనగరం నగరం సన్నద్ధమైంది. నిజాం నవాబుల కాలం నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలు యాదవుల ఐక్యతకు, పాడిపంటలు, పశు సంపదకు నిదర్శనం. ఏటా దీపావళి మరుసటి రోజు సదర్‌ వేడుకలను నిర్వహిస్తారు. ఖైరతాబాద్‌లో ఇవాళ, నారాయణగూడ వైఎంసీఏ ఈ నెల 9న వద్ద వేడుకలు జరుగనున్నాయి. అన్ని పార్టీల నాయకులు, ప్రముఖులు వేడుకల్లో పాల్గొంటారు. మరోవైపు నగర శివార్లలోనూ సదర్‌ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ వేడుకల్లో బలిష్టమైన, శక్తివంతమైన దున్నలను ప్రదర్శించనున్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సారి కూడా దేశంలోనే బాగా పేరొందిన దున్నలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంతో వైవిధ్యంతో, అబ్బురపరిచే దున్నల విన్యాసాలతో కనులపండువగా జరిగే ఈ వేడుకలు పిల్లలను, పెద్దలను విశేషంగా ఆకట్టుకుంటాయి. యువత కేరింతలు, హోరెత్తించే నినాదాలు, ఆనందోత్సాహాల నడుమ తెల్లవారు జాము వరకు నిర్వహిస్తారు. సుమారు 75 ఏళ్ల క్రితం నగరంలోని యాదవులందరినీ సంఘటితం చేసేందుకు ఈ ఉత్సవాలను ప్రారంభించినట్లు అఖిలభారత యాదవ సమాజం తెలిపింది.

మరోవైపు నిన్న సత్తార్ బాగ్‌లో 25 కోట్ల విలువైన దున్నపోతు షెహన్ షాను తిలకించేందుకు వెళ్లిన మహమూద్ అలీకి పెను ప్రమాదం తప్పింది.. కొందరు వ్యక్తులు దున్నపోతులతో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు.. దీంతో దున్నపోతులు బెదిరిపోయి నడిరోడ్డుపై పరుగులు పెట్టాయి.. దీంతో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు, పాదాచారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే అక్కడే ఉన్న డిప్యూటీ సీఎం మాత్రం వాటి దాడి నుంచి తప్పించుకున్నారు. కానీ ఆ‍యన కాన్వాయ్‌ స్వల్పంగా దెబ్బతింది. అయితే ఎట్టకేలకు ఆ రెండు దున్నపోతులను పట్టుకున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories