నాకు వరుడు కావాలి.. యువతీ పోస్ట్ వైరల్!

నాకు వరుడు కావాలి.. యువతీ పోస్ట్ వైరల్!
x
Highlights

మాట్రిమోనీ, పెళ్లిళ్లు కుదిర్చే వెబ్ సైట్లను కాదని ఓ యువతీ పేస్ బుక్ ను ఆశ్రయించింది. తనకు తగిన వరుడు కావాలంటూ ఫేస్బుక్ లో తన పేరు చిరునామా తోపాటు...

మాట్రిమోనీ, పెళ్లిళ్లు కుదిర్చే వెబ్ సైట్లను కాదని ఓ యువతీ పేస్ బుక్ ను ఆశ్రయించింది. తనకు తగిన వరుడు కావాలంటూ ఫేస్బుక్ లో తన పేరు చిరునామా తోపాటు ఫోటో కూడా పెట్టింది. దీంతో ఆ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది. కేరళకు చెందిన కేజీ జ్యోతి (28) అనే యువతీ ఫ్యాషన్ డిజైనింగ్‌లో బీఎస్సీ పూర్తి చేసింది.చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. ఆమెకు ఓ సోదరి, సోదరుడు ఉన్నారు. ఇటీవల తన పెళ్లి సంబంధంకోసం కొన్ని వెబ్‌సైట్లు, మ్యారేజ్ బ్యూరో ల వద్దకు వెళ్ళింది. వారు భారీగా రేట్ చెప్పడంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. దీంతో వారి దోపిడీకి అడ్డుకట్ట వెయ్యాలని అనుకుంది. అందులో భాగంగా ముందుగా పేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ను ఫేస్బుక్ లో మ్యారేజ్ సెట్ చేసుకునేందుకు వీలుగా అప్లికేషన్ రూపొందించాలని లెటర్ రాసింది. ఆ తరువాత తన ఫోటో చిరునామా రాసి నాకు తగిన వరుడు కావాలని ఫేస్బుక్ లో షేర్ చేసింది అంతే ఆమె పోస్టుకు కొందరు వ్యంగంగాను మరికొందరు వినూత్నంగా ఉందని ప్రశంసలు ఇస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories