భర్తను దారుణంగా హత్య చేసిన భార్య.. ఆపై నాటకం!

nanireddy
Updated on: 24 Dec 2018 1:40 PM IST
భర్తను దారుణంగా హత్య చేసిన భార్య.. ఆపై నాటకం!
X

కట్టుకున్న భర్తను దారుణంగా గొడ్డలితో నరికి చంపింది ఓ మహిళ ఈ ఘటన కరీంనగర్, పెద్దపల్లి మండలం గొల్లపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన కొక్కుల ఓదెలు (65) రాజేశ్వరి.. భార్యభర్తలు. ఓదెలు సింగరేణి కార్మికుడిగా చేసి రిటైర్ అయ్యాడు. మద్యానికి బానిసైన ఓదెలు కుటుంబాన్ని సరిగా పట్టించుకునేవాడు కాదు.ఈ విషయంలో దంపతులమధ్య కలతలు వచ్చాయి. అవి తీవ్రమవడంతో వీరి మధ్య తీవ్ర ఘర్షణ చోటుకుచేసుకుంది. భర్త వ్యవహారశైలితో మనస్థాపం చెందిన రాజేశ్వరి అర్ధ రాత్రి దాటిన తరువాత ఇంటి ముందు వరండాలో పడుకున్న ఓదెలును గొడ్డలితో తలపై నరికింది. అప్పటికి ఓదెలు చనిపోకపోవడంతో కర్రతో తలపై బాదింది. అనంతరం ప్రాణాలు కోల్పోయిన తరువాత గొడ్డలిని, కర్రలను దాచిపెట్టి పక్కింటి వాకిరి తన భర్తను దొంగలు వచ్చి చంపి వేశారని నాటకమాడింది. ఇంతలో బంధువులకు విషయం తెలియడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా భార్యే ఓదెలు ను చంపిందని నిర్ధారించారు.

nanireddy

nanireddy

Next Story