Top
logo

మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య

మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య
X
Highlights

మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నిర్మల్‌ జిల్లాలో జరిగింది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో...

మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నిర్మల్‌ జిల్లాలో జరిగింది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ధర్మారం తండాకు చెందిన 26 ఏళ్ల మధురేఖ ప్రస్తుతం కడెం పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తోంది.. ఇవాళ ఉదయాన్ని విధులు నిర్వర్తించిన తరువాత తన క్వార్టర్స్‌కు వెళ్లిన మధురేఖ.. తరువాత ఎవరితోనూ మాట్లాడలేదు. సహచర కానిస్టేబుళ్లు ఎన్నిసార్లు ఫోన్‌ చేస్తున్నా మధురేఖ స్పందించలేదు.. దీంతో అనుమానం వచ్చి.. ఆమె క్వార్టర్స్‌కు వెళ్లి చూడగా నోట్లోనుంచి నురగలు వస్తుండటంతో తమ.. పై..అధికారులకు సమాచారం అందించారు. అయితే ఆసుపత్రికి వెళ్తున్న మధ్యలోనే మధురేఖ మృతి చెందింది. మూడు నెలల కిందటే వివాహం చేసుకున్న మధురేఖ ఆత్మహత్యకు గలకారణాలు తెలియరాలేదు. ఇక కానిస్టేబుల్ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story