13 ఏళ్ల బాలికతో వ్యభిచారం చేయించిన ముగ్గురు మహిళలు

nanireddy
Updated on: 24 Dec 2018 1:51 PM IST
13 ఏళ్ల బాలికతో వ్యభిచారం చేయించిన ముగ్గురు మహిళలు
X

అభం శుభం తెలియని 13 ఏళ్ల బాలికను వ్యభిచార రొంపిలోకి దింపారు ముగ్గురు మహిళలు.రహస్యంగా తల్లికి ఫోన్ చేసి వారి భారినుంచి బయటపడింది బాలిక. వివరాల్లోకి వెళితే పంజాబ్ రాష్ట్రం లుధియానాకు చెందిన 13 ఏళ్ల బాలికను కిడ్నప్ చేశారు ముగ్గురు మహిళలు. అనంతరం లుధియానాలోని ఓ అపార్ట్మెంట్ కు తీసుకెళ్లి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు తిప్పుతూ.. బాలికపై పలువురి చేత అత్యాచారం చేయించి డబ్బు సంపాదిస్తున్నారు. కొన్ని రోజుల పాటు బాలికను ఇలాగే హింసించారు. దీంతో వారి టార్చర్ తట్టుకోలేని బాలిక రహస్యంగా తన తల్లికి ఫోన్‌ చేసి చెప్పటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను వారి చెరనుంచి కాపాడారు. ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

nanireddy

nanireddy

Next Story