ప్రేమ పేరుతో నరేష్ మోసం చేశాడు

nanireddy
Updated on: 24 Dec 2018 2:45 PM IST
ప్రేమ పేరుతో నరేష్ మోసం చేశాడు
X

ప్రేమ పేరుతో తనను న‌మ్మించి, మోసం చేశాడని ప్రియుడి ఇంటి ఎదుట మౌన దీక్షకు దిగింది ఓ యువతి. తెలంగాణ రాష్ట్రం కామేపల్లి మండలంకు చెందిన భూక్య నరేష్, గార్ల మండలంకు చెందిన ఓ యువతిని నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఓ అద్దె రూమ్ తీసుకుని రెండేళ్లపాటు ఇద్దరు కలిసి ఉన్నారు. ఇటీవల నరేష్‌కు వ్యవసాయ శాఖలో ఏఈఓగా ఉద్యోగమొచ్చింది. తనను వివాహం చేసుకోవాలని ఆమె కోరింది. అతడు నిరాకరించాడు. తనను పెళ్లి చేసుకుంటానని నాలుగేళ్లపాటు నమ్మించి, తనను లొంగదీసుకుని, ఇప్పుడు మొహం చాటేస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరిగేంత వరకు మౌన దీక్షను కొనసాగిస్తానట్టుంది.

nanireddy

nanireddy

Next Story