మాజీ ప్రియుడిని నదిలో తోసేసిన మహిళ..

మాజీ ప్రియుడు తన న్యూడ్ ఫోటోలను సామజిక మధ్యమాల్లో పెడతానని బెదిరించడంతో అతన్ని నదిలోకి నెట్టి ప్రాణాలు తీసిందో ...
మాజీ ప్రియుడు తన న్యూడ్ ఫోటోలను సామజిక మధ్యమాల్లో పెడతానని బెదిరించడంతో అతన్ని నదిలోకి నెట్టి ప్రాణాలు తీసిందో మహిళ. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో జరిగింది. నొయిడాకు చెందిన డాలీ చౌదరీ(21), సుశీల్ కుమార్(23)లు కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. అయితే కొంతకాలం క్రితం వారిద్దరికీ మనస్పర్థలు వచ్చాయి. దాంతో వారిద్దరూ విడిపోయారు. ఈ క్రమంలో మోహిత్ మావి(28) అనే వ్యక్తితో గ్రేటర్ నోయిడాలో డాలీ చౌదరీ సహజీవనం చేస్తోంది. అయితే తన భర్త డాలీ చౌదరీతో సహజీవనం చేస్తున్నాడని తెలిసి మోహిత్ భార్య ఆగస్టు 7న ఆత్మహత్య చేసుకుంది. దాంతో భార్య తరపు బంధువులు ఏమైనా చేస్తారేమోనన్న భయంతో మోహిత్ బెంగుళూరుకు పారిపోయాడు. అయితే ఇటీవల డాలీకి మనీష్ చౌదరీ అనే వ్యక్తితో పెళ్లి చేయాలని డాలీ తండ్రి అనుకున్నాడు. కానీ వ్యవహారం బట్టబయలు కావడంతో ఆ పెళ్లి కుదరలేదు. ఇదేఅదనుగా భావించిన డాలి మొదటి ప్రియుడు ఆమెతో మళ్ళీ స్నేహానికి ప్రయత్నించాడు. కానీ ఆమె నిరాకరించింది.అతను తన మాట వినకుంటే నీ న్యూడ్ ఫోటోలను సామజిక మాధ్యమాల్లో పెడతానని డాలీని బెదిరించాడు. అతడి బెదిరింపులకు భయపడిన డాలి హత్యకు పథకం రచించింది. సమస్యను పరిష్కరించుకుందామనిఓ హోటల్ కు పిలిచింది. అక్కడే మరో వ్యక్తి సహాయంతో కూల్ డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి సుశీల్‌కు ఇచ్చింది. స్పృహ కోల్పోయిన అనంతరం ఇద్దరు కలసి సుశీల్ కుమార్‌ను చంపి ఆ తర్వాత మాధురా రైల్వే స్టేషన్ వద్ద యమునా నదిలో పడేశారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
ముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
19 Aug 2022 4:15 PM GMTBanana Problems: అరటిపండు అతిగా తింటే వచ్చే సమస్యలు ఇవే..!
19 Aug 2022 4:00 PM GMTకన్నీటి పర్యంతమైన 'గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ'.. డిప్యూటీ సీఎం సాయం..
19 Aug 2022 3:45 PM GMTసుకన్య సమృద్ధియోజన, పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్ర వడ్డీరేట్లు పెరిగే...
19 Aug 2022 3:30 PM GMTPM Modi: దేశంలో 10 కోట్ల ఇళ్లకు తాగునీరు..
19 Aug 2022 3:15 PM GMT