చంటి బిడ్డతో సహా మహిళ ఆత్మహత్య

nanireddy
Updated on: 24 Dec 2018 2:11 PM IST
చంటి బిడ్డతో సహా మహిళ ఆత్మహత్య
X

భర్త వేధింపులు భరించలేక ఓ మహిళ, చంటి బిడ్డతో సహా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహారాష్ట్ర థానే జిల్లా భాయందర్‌ రైల్వే స్టేషన్‌లో జరిగింది. నవఘడ్‌ కు చెందిన రాహుల్‌ పింటూ, రేణుక పింటూ(24) దంపతులు. వీరికి రెండేళ్ల కుమర్తె 'ఆరోహి' ఉంది. కొంతకాలంగా రాహుల్ రేణుక ల మధ్య కలతలు వచ్చాయి. చెడు అలవాట్లకు బానిసైన రాహుల్ కుటుంబాన్ని సరిగా పట్టించుకోకుండా వేధించడంతో రేణుక మనస్థాపం చెందింది. దీంతో చనిపోవాలని నిర్ణయం తీసుకుంది. అయితే తాను చనిపోతే కుమార్తె అనాథ అవుతుందేమోనన్న ఆలోచనతో.. కుమార్తెను తీసుకుని భాయందర్‌ రైల్వే స్టేషన్ కు చేరుకుంది. నాలుగో ప్లాట్ ఫార్మ్ నుంచి రైలు కోసం ఎదురు చూస్తూ రైలు దగ్గరికి రాగానే ఒక్కవేటున దూకేసింది. అది గమనించిన డ్రైవర్‌ బ్రేకులు వేయగా.. అప్పటికే ఆ తల్లీకూతుళ్లు రైలు కిందపడి మరణించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతురాలి తండ్రి, భర్తలను విచారిస్తున్నారు.

nanireddy

nanireddy

Next Story