స్నానం చేస్తుండగా ఫొటోలు తీసిన పోకిరి.. పోలీస్ స్టేషన్ ఎదుటే మహిళ ఆత్మహత్యాయత్నం

nanireddy
Updated on: 24 Dec 2018 2:50 PM IST
స్నానం చేస్తుండగా ఫొటోలు తీసిన పోకిరి.. పోలీస్ స్టేషన్ ఎదుటే మహిళ ఆత్మహత్యాయత్నం
X

పోకిరి వేధింపులు తాళలేక పోలీస్ స్టేషన్ కు వచ్చింది ఓ మహిళ. కానీ అక్కడ సరైన పరిష్కారం దొరకక ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈ ఘటన సికింద్రాబాద్ బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట జరిగింది. బేగంపేటలోని అన్నానగర్‌ కు చెందిన సబిత. ఇటీవల బాత్రూంలో స్నానం చేస్తుండగా వెంకటేష్ గౌడ్ అనే వ్యక్తి తన ఫొటోలు తీశాడని, వాటిని అడ్డం పెట్టుకుని వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఆమె గోడును పట్టించుకోలేదు పోలీసులు. దీంతో తనను పట్టించుకోని కారణంగా ఏకంగా పోలీస్ స్టేషన్‌ ముందే ఆత్మహత్యాయత్నం చేసింది సబిత.అందరూ చూస్తుండగానే పోలీస్ స్టేషన్‌ ముందు ఆత్మహత్యాయత్నం చేసింది సబిత. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. రోడ్డుపై వెళ్లేవాళ్లు… అతికష్టం మీద మంటలను ఆర్పేశారు. కానీ అప్పటికే ఆమె శరీరం 70 శాతం కాలిపోయింది. ప్రస్తుతం ఆసుపత్రిలో సబిత చికిత్స పొందుతోంది.

nanireddy

nanireddy

Next Story