Top
logo

 మారుతికి అది ప్ల‌స్స‌వుతుందా?

 మారుతికి అది ప్ల‌స్స‌వుతుందా?
X
Highlights

'ఈరోజుల్లో', 'బ‌స్‌స్టాప్‌', 'కొత్త జంట‌', 'భ‌లే భ‌లే మ‌గాడివోయ్'.. ఇలా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న యూత్...

'ఈరోజుల్లో', 'బ‌స్‌స్టాప్‌', 'కొత్త జంట‌', 'భ‌లే భ‌లే మ‌గాడివోయ్'.. ఇలా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న యూత్ చిత్రాల స్పెష‌లిస్ట్‌ మారుతికి అత‌ని గ‌త చిత్రం 'బాబు బంగారం' రిజ‌ల్ట్‌ షాక్ ఇచ్చింది. దీంతో త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్‌తో ఎలాగైనా హిట్ కొట్టాల‌న్న క‌సితో ఉన్నాడు మారుతి. అందుకే.. ప్ర‌స్తుతం వ‌రుస‌ విజ‌యాల‌తో మంచి ఫామ్‌లో ఉన్న శ‌ర్వానంద్‌తో 'మ‌హానుభావుడు' సినిమా చేస్తున్నాడు మారుతి. మెహ‌రీన్‌ ఇందులో క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

ద‌స‌రా కానుక‌గా సెప్టెంబ‌ర్ 29న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. మారుతి కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్ అయిన 'భ‌లే భ‌లే మ‌గాడివోయ్' కూడా సెప్టెంబ‌ర్ నెల‌లోనే విడుదలైంది. 'మ‌హానుభావుడు' విష‌యంలో కూడా మ‌రోసారి సెప్టెంబ‌ర్ సెంటిమెంట్ రిపీట్ అయితే.. మారుతి కెరీర్‌కి ప్ల‌స్ అయిన‌ట్టే. చూద్దాం.. ఏం జ‌రుగుతుందో?

Next Story