అన్న బాట‌లో అఖిల్ వెళ‌తాడా?

అన్న బాట‌లో అఖిల్ వెళ‌తాడా?
x
Highlights

భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజైన అక్కినేని అఖిల్ తొలి చిత్రం 'అఖిల్' ఆశించిన విజ‌యం సాధించలేదు. ప్ర‌స్తుతం 'హ‌లో' అంటూ రెండో సినిమా చేస్తున్నాడీ యంగ్ హీరో....

భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజైన అక్కినేని అఖిల్ తొలి చిత్రం 'అఖిల్' ఆశించిన విజ‌యం సాధించలేదు. ప్ర‌స్తుతం 'హ‌లో' అంటూ రెండో సినిమా చేస్తున్నాడీ యంగ్ హీరో. 'ఇష్క్‌', 'మ‌నం', '24'వంటి వ‌రుస విజ‌యాలు సొంతం చేసుకున్న విక్ర‌మ్ కుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 22న విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. నాగ‌చైత‌న్య తొలి చిత్రం 'జోష్' ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోయినా.. రెండో చిత్రం 'ఏమాయ చేసావె' ప్రేమ‌క‌థ‌తో రూపొంది హిట్ చిత్రంగా నిలిచింది. త‌న రెండో చిత్రాన్ని ప్రేమ‌క‌థా చిత్రంగా తెర‌కెక్కిస్తున్న అఖిల్ కూడా అదే బాట‌లో వెళ్లి హిట్ కొడ‌తాడేమో చూడాలి. ఇప్ప‌టివ‌ర‌కు విడుద‌లైన 'హ‌లో' స్టిల్స్‌కి మంచి స్పంద‌నే ల‌భించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories