ప్రియుడిని ఇంటికి పిలిచి తలుపు గడియవేసి దారుణానికి పాల్పడింది!

ప్రియుడిని ఇంటికి పిలిచి తలుపు గడియవేసి దారుణానికి పాల్పడింది!
x
Highlights

వివాహేతర సంబంధంలో ఉన్న ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయడంతో పాటు ఘటనను పక్కదారి పట్టించాలని ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయింది. ఈ కేసు...

వివాహేతర సంబంధంలో ఉన్న ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయడంతో పాటు ఘటనను పక్కదారి పట్టించాలని ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయింది. ఈ కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన బాలానగర్‌ పోలీసులు నిజాన్ని రాబట్టి నిందితులను అరెస్టు చేశారు. వివరాలను శుక్రవారం ఏసీపీ టి.గోవర్ధన్‌, సీఐ బి.కిషన్‌కుమార్‌ వెల్లడించారు.

విజయనగరం జిల్లా, బాలాజీపేట్‌ మండలం, పనుకు వలస గ్రామానికి చెందిన పెద్దింటి జగదీశ్వర్‌రావు అలియాస్‌ శంకర్‌రావుకు 2012లో తులసితో వివాహం అయింది. వీరికి ఇద్దరు మగపిల్లలు. బతుకుదెరువు కోసం ఏడేళ్ల క్రితం నగరానికి వచ్చి రంగారెడ్డినగర్‌, పంచశీల కాలనీలో నివసిస్తూ గాంధీనగర్‌ పారిశ్రామికవాడలో గల శ్రీ సావిటర్‌ సోలార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. సూర్యాపేట జిల్లా, మునగాల మండలం, జగన్నాథపురం గ్రామానికి చెందిన చీమ వీరబాబు(26) కూడా ఇదే కంపెనీలో పనిచేస్తుండడంతో ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. అతడు కూడా పంచశీల కాలనీలో నివసిస్తున్నాడు.

జగదీశ్వర్‌ ఇంటికి వీరబాబు తరచూ వెళుతుండడంతో తులసితో పరిచయం ఏర్పడడంతో వివాహేతర సంబంధానికి దారితీసింది. రెండేళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారం ఓ రోజు తులసి భర్త కంటపడింది. కోపోద్రిక్తుడైన అతడు వీరబాబును మందలించాడు. మరోసారి వారిద్దరూ జగదీశ్వర్‌ కంటపడటంతో వీరబాబు.. జగదీశ్వర్‌ మధ్య వాగ్వాదం జరిగింది. నా భార్యతో వివాహేతర సంబంధం మానుకోవాలని జగదీశ్వర్‌ అతడిని గట్టిగా మందలించాడు. తులసి, వీరబాబు జగదీశ్వర్‌ను ఎలాగైనా అడ్డు తొలగించాలని పథకం వేశారు.

భర్తను వదిలించుకోవాలని ప్రియుడు వీరబాబుతో కలిసి తులసి గతనెల 24న పథకం రూపొందించింది. ఆ రోజు కంపెనీ నుంచి మధ్యాహ్నం భోజనానికి ఇంటికొచ్చిన జగదీశ్వర్‌రావును వీరబాబు అనుసరించాడు. అతడి వెంటే లోపలికి ప్రవేశించాడు. వెంటనే తులసి తలుపు గడియవేసి చున్నీతో భర్త మెడకు బిగించింది. ప్రియుడు ఆమెకు సహకరించి ఇద్దరూ కలిసి హత్య చేశారు. తర్వాత వీరబాబు వెళ్లిపోగా.. తన భర్త గుండెపోటుతో మరణించాడని తులసి చుట్టుపక్కల వారిని నమ్మించింది. అనుమానంతో మృతుడి తమ్ముడు శంకర్‌రావు ఫిర్యాదుచేయగా ఎస్‌ఐలు బి.వీరప్రసాద్‌, రవికిరణ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇరుగు పొరుగువారు, జగదీశ్వర్‌రావు పనిచేసిన చోట ఇతరులు.. ఇలా పలువురితో మాట్లాడగా విచారణలో నిందితులిద్దరి తీరుపై పలు అంశాలు వెలుగు చూశాయి. నిందితులిద్దరినీ శుక్రవారం పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. వారి నుంచి రెండు సెల్‌ఫోన్లు, మోటార్‌సైకిల్‌ స్వాధీనం చేసుకున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories