భర్త ఫోన్ కు భార్య అశ్లీల ఫోటోలు

భర్త ఫోన్ కు భార్య అశ్లీల ఫోటోలు
x
Highlights

భర్త ఫోన్ కు భార్య నగ్న చిత్రాలు పంపాడో వ్యక్తి.. ఆరాతీసిన భర్తకు ఆ అజ్ఞాత వ్యక్తి తన భార్య మాజీ ప్రియుడని అర్ధమైంది. దీంతో వారి మూన్నాళ్ళ పెళ్లి...

భర్త ఫోన్ కు భార్య నగ్న చిత్రాలు పంపాడో వ్యక్తి.. ఆరాతీసిన భర్తకు ఆ అజ్ఞాత వ్యక్తి తన భార్య మాజీ ప్రియుడని అర్ధమైంది. దీంతో వారి మూన్నాళ్ళ పెళ్లి పెటాకులైపోయేంతగా వ్యవహారం దారి తీసింది. ఈ ఘటన ఒడిశా రాష్ట్రం జయపురం సమీపంలోని తండాలో చోటుచేసుకుంది. జయపురం తండా కు చెందిన యువకుడికి బొరిగుమ్మ గ్రామానికి చెందిన యువతితో ఏప్రిల్ 20వ తేదీన వివాహం జరిగింది.అయితే ఆమెకు పెళ్లి అవడాన్నిజీర్ణించుకోలేని మాజీ ప్రేమికుడు నూతన దంపతుల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో గతంలో యువతీని నగ్నంగా తీసిన ఫోటోలను భర్త వాట్సాప్ కు పంపాడు. దీంతో ఫోటోలను చూసిన భర్త హతాశుడయ్యాడు. ఇదేంటని భార్యను ప్రశ్నించగా ఆమె తనకు ఏమి తెలియదని చెప్పింది. అయితే క్రమంగా అతను తన భార్య మాజీ ప్రియుడని గుర్తించాడు. అంతే ఇక ఆమెతో వైవాహిక జీవితం కొనసాగించలేననని తేల్చి చెప్పి దూరంగా ఉంటున్నాడు. కాగా నగ్న ఫోటోలపై పిర్యాదు చేసింది బాధిత మహిళ. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories