పీఎం అని గౌర‌వం ఇస్తే మమ్మ‌ల్నే ఎక్కి తొక్కేస్తారా

x
Highlights

తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ నేతలు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. నాలుగు బడ్జెట్లలో ఏపీకి అన్యాయం జరిగిందన్న...

తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ నేతలు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. నాలుగు బడ్జెట్లలో ఏపీకి అన్యాయం జరిగిందన్న చంద్రబాబు... ఏపీ ప్రయోజనాల కోసం రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ఏపీ కష్టాలను కేంద్రం పట్టించుకోకపోవడంతోనే...అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామన్నారు. సెంటిమెంట్‌తో తెలంగాణ ఇచ్చారన్న చంద్రబాబు...ఏపీలో కూడా సెంటిమెంట్స్ ఉన్నాయని.. ఇక్కడెందుకు న్యాయం చేయరని ప్రశ్నించారు.

15వందల కోట్లతో రాజధాని నిర్మాణం సాధ్యమేనా అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు చంద్రబాబు. ప్రధాని అని గౌరవమిస్తే...అందర్ని తనపైకి రెచ్చగొడుతున్నారని విమర్శించారు. రక్షణ బడ్జెట్‌ అడిగేంత సంస్కార హీనులమా ? మీ ఒక్కరికే దేశభక్తి ఉందా ? మాకు లేదా అంటూ ఘాటుగా ప్రశ్నించారు. మీరొక్కరే దేశాన్ని కాపాడుతారా అని అన్నారు. రెవెన్యూ లోటు కింద 20వేల కోట్లు రావాల్సి ఉందన్నారు.

రాజధాని రైతులు 33వేల ఎకరాల భూములు ఇచ్చారని చంద్రబాబు తెలిపారు. రాజధాని విషయంలో కేంద్రానికి బాధ్యత లేదా అని అన్నారు. పవన్‌ కల్యాణ్‌ 15వందల ఎకరాలు చాలంటున్నారని...ఎవరెన్ని అడ్డంకులు సృష్టించాలనుకున్నా రాజధాని నిర్మాణం మాత్రం ఆగదన్నారు. రైల్వే జోన్‌పై కేంద్రం తీరు ఆశ్చర్యకరమన్న బాబు...నాలుగేళ్ల తర్వాత జోన్‌ గురించి ఆలోచించడం దారుణమన్నారు.

పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అన్న చంద్రబాబు...ప్రాజెక్టు పూర్తయితే నీటి ఎద్దడి ఉండదని వెల్లడించారు. పోలవరం నిర్మాణానికి అడ్డంకులు సృష్టించి...రాష్ట్రాభివృద్ధికి అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మానంలో అవినీతి జరిగిందంటూ...తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుపై పవన్‌ కల్యాణ్‌ అవగాహన ఉండి మాట్లాడుతున్నారా ? లేక మాట్లాడుతున్నారా అని చంద్రబాబు అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories