హైదరాబాదే ఎందుకు డిసైడ్ చేసుకున్నారు? తెర వెనుక ఏం జరిగింది?

అనుకున్నట్టే కన్నడ పీఠం దక్కించుకున్న బీజేపీ బలనిరూపణపై దృష్టి సారించిందా ? విపక్ష ఎమ్మెల్యేలను తమ గూటికి...
అనుకున్నట్టే కన్నడ పీఠం దక్కించుకున్న బీజేపీ బలనిరూపణపై దృష్టి సారించిందా ? విపక్ష ఎమ్మెల్యేలను తమ గూటికి చేర్చేందుకు చాపకింద నీరులా ప్రయత్నాలు చేపట్టిందా ;? కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల్లో పలువురు కమలం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారా ? ఆపరేషన్ కమల్ 2 పేరుతో బలనిరూపణకు ఏర్పాట్లు చేస్తోందా ? అంటే అవుననే సమాధానాలు బెంగళూరు నుంచి ఢిల్లీ వరకు వినిపిస్తున్నాయి.
బలనిరూపణ సమయంలో మేజిక్ ఫిగర్ దక్కించుకునేందుకు బీజేపీ భారీ ప్రణాళిక సిద్ధం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. కర్నాటక శాసనసభలో ప్రస్తుతం 221 మంది ఎమ్మెల్యేలు ఉండగా .. బీజేపీకి 104 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అయితే బలపరీక్షనిరూపణ నేపధ్యంలో స్వీకర్ ఎంపిక అత్యంత కీలకంగా మారనుంది. తమ పక్షానికి చెందిన వ్యక్తినే స్పీకర్ చేయాలని భావిస్తున్న బీజేపీ పక్షం తొలుత 7 మంది ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఫిరాయింపుదార్లకు వ్యతిరేకంగా స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా కాలయాపన చేసేలా పథక రచన చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే బలనిరూపణ సమయంలో ఈ ఏడుగురిని ఓటింగ్‌కు దూరంగా ఉంచడం ద్వారా ఎమ్మెల్యేల బలం 221 నుంచి 214కు చేరుతుంది. దీంతో మేజిక్ ఫిగర్ 107కి చేరుతుంది. ప్రస్తుతం ఉన్న సంఖ్యా బలం దృష్యా మరో ఇద్దరు సభ్యులు మద్ధతిస్తే బలనిరూపణలో విజయం సాధించేలా ప్లాన్ సిద్ధం చేసినట్టు సమాచారం.
ఈ బాధ్యతలను ముఖ్యమంత్రి యడ్యూరప్పతో పాటు మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్‌రెడ్డిలకు అప్పగించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వారితో ముఖ్యమంత్రి యడ్యూరప్ప సంప్రదింపులు జరుపుతుండగా .. రాయచూరు, బళ్ళారి, కొప్పళ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవడంలో గాలి బ్రదర్స్ బిజీగా ఉన్నారు. వీరి వ్యూహం ఫలించి బళ్ళారి జిల్లా విజయనగరం ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్, మాస్కి ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ పాటిల్ బీజేపీ శిబిరంలో చేరినట్టు భావిస్తున్నారు. బీజేపీ నేతలతో మొత్తం 16 మంది టచ్‌లో ఉన్నారని చెబుతున్నా వ్యూహాత్మకంగా పేర్లు బయటకు వెళ్లడించడం లేదు.
Bandi Sanjay: డీజీపీకి డెడ్‌లైన్ విధించిన బండి సంజయ్
15 Aug 2022 9:19 AM GMTతెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన కే.కేశవరావు
15 Aug 2022 8:15 AM GMTగోల్కొండ కోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
15 Aug 2022 6:33 AM GMTచిరంజీవి బ్లడ్ బ్యాంకులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 6:17 AM GMTమంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 4:49 AM GMT75th Independence Day: తెలంగాణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 2:52 AM GMTFreedom Rally: పోలీసుల తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
13 Aug 2022 10:37 AM GMT
మరింత వేడెక్కుతున్న మునుగోడు పాలిటిక్స్
16 Aug 2022 5:04 AM GMTవరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్న సీఎల్పీ బృందం
16 Aug 2022 4:06 AM GMTనంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం
16 Aug 2022 3:51 AM GMTరిషి సునాక్ కు వ్యతిరేక పవనాలు
16 Aug 2022 3:34 AM GMTఇవాళ రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం
16 Aug 2022 3:09 AM GMT