Top
logo

ఎంబామింగ్ అంటే ఏమిటి అది ఎలా చేస్తారు?!

ఎంబామింగ్ అంటే ఏమిటి అది ఎలా చేస్తారు?!
X
Highlights

ఆత్మీయులు మరణించినప్పుడు వారి మృతదేహాన్ని కడసారి చూసిన రూపం చిరకాలం గుర్తుండిపోతుంది. ఆ తుది జ్ఞాపకం...

ఆత్మీయులు మరణించినప్పుడు వారి మృతదేహాన్ని కడసారి చూసిన రూపం చిరకాలం గుర్తుండిపోతుంది. ఆ తుది జ్ఞాపకం ఇబ్బందికరంగా కాకుండా, ఎప్పట్లా ఆత్మీయంగానే ఉండాలని చాలామంది కోరుకుంటారు. ఈ కోరికను తీర్చేదే ఎంబామింగ్‌. ఏంటి ఎంబామింగ్‌.? ఎలా చేస్తారు? ఎందుకు చేస్తారు? ఎంబామింగ్‌ వాడే కెమికల్‌ ఏంటి? ఎంబామింగ్‌ ప్రక్రియ పూర్తయ్యాక ఎన్నాళ్లు బాడీని ఎన్నాళ్లు కాపాడుకోవచ్చు? హావ్‌ ఏ లుక్‌..

ఎంబామింగ్‌. ఇది అసాధారణమైన ప్రక్రియ. మరణించిన వ్యక్తి అంతకుముందు మంచి ఆరోగ్యంతో ఉన్నప్పుడు తీసిన ఫొటోను ఎంబామింగ్‌ కోసం ఉపయోగిస్తారు. జననం ఎంత సహజమో, మరణం అంతే సహజం. కానీ ఈ రెంటినీ ఒకే మోస్తరుగా జీర్ణించుకోలేకపోవడమే సామాన్యుల నైజం. ఇంతకాలం తమమధ్యనే ఉంటూ తమకు వెన్నుదండుగా ఉండే ప్రియతమ వ్యక్తులు ఉన్నట్టుండి హఠాత్తుగా కనుమరుగైనప్పుడు వారి రూపాన్ని మనసులోనేకాకుండా, కళ్లెదుట కూడా ప్రశాంత వదనంతో కనిపించాలని కోరుకోవడం తప్పేమీకాదు. ఈ తరహా మనోభావాలకు రూపకల్పం ఇచ్చేదే ఎంబామింగ్.

అందంగా లేని వారు అందమైన అలంకరణలు చేసుకోవడం, ఆకర్షణీయంగా కనిపించడం కోసం చేసే పక్రియలనే ఎంబామింగ్ అంటారు. ఇంతకీ ఎంబామింగ్ అంటే ఏమిటి? కొన్ని సందర్భాల్లో మృతదేహాన్ని చాలా రోజులపాటు అంత్యక్రియలు నిర్వహించకుండా ఉంచాల్సి ఉంటుంది. అప్పుడు మృతదేహం కుళ్లిపోకుండా చూడాలి. శరీరం కొంతకాలంపాటు దెబ్బతినకుండా ఉండేందుకు ఎంబామింగ్ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో కొన్ని రసాయనాలను శరీరంలోకి ఎక్కిస్తారు. ఈ ద్రావకాలనే ఎంబామింగ్ ఫ్లూయిడ్స్ అని పిలుస్తారు. ఫార్మాల్డిహైడ్, మెథనాల్, ఇథనాల్‌తోపాటు మరికొన్ని రకాల కెమికల్స్‌ను ఎంబామింగ్‌లో వాడుతారు.

చనిపోయిన వ్యక్తి ఫొటో ఆధారంగా మృతదేహానికి సాధ్యమైనంతగా మునుపటి రూపాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాడు ఎంబామింగ్ నిపుణుడు. బుగ్గలు బాగా లోపలికి వెళ్తే.. మైనపు పూతపూసి ఉబ్బినట్లు చేస్తారు. చాలారోజులపాటు అస్వస్థతకు గురైనవారి కనుగుడ్లు పీక్కుపోయి ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ప్లాస్టిక్ కనుగుడ్లను సహజంగా అమర్చుతారు. శరీరంపై పడిన ముడతలను తొలగిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మృతదేహానికి సజీవ రూపం వస్తుంది. దీనినే ఫేస్ లిఫ్టింగ్ అని కూడా అంటారు. అమెరికాలాంటి దేశాల్లో మరణించిన భారతీయుల మృతదేహాలను స్వస్థలాలకు తీసుకు వచ్చేందుకు చాలా రోజులు పడుతుంది. ఈలోపు శరీరాలు కుళ్లిపోకుండా ఉండటంతోపాటు, ఆత్మీయుల బాధను కాసింతైనా తగ్గించేందుకు అమెరికా అధికారులు ఎంబామింగ్, గ్రూమింగ్ చేసిన తర్వాతే మృతదేహాలను తరలిస్తుంటారు.

అమెరికాలో ఏటా 2 కోట్ల టన్నుల ఎంబామింగ్ కెమికల్స్‌ వినియోగిస్తారని అంచనా. అమెరికాలో ఇప్పుడు ఎంబామింగ్ పద్ధతిలో ఆత్మీయుల మృతదేహాలను కుళ్లిపోకుండా చేయడంలో ముందున్నారు. అక్కడ ఏటా 2కోట్ల టన్నుల ఎంబామింగ్ ప్లూయిడ్స్, కెమికల్స్ అమ్ముడవుతున్నాయంటే, ఈ ప్రకియ అవసరం ఎంతగా గుర్తించారో అర్థం చేసుకోవచ్చు. ఎంబామింగ్ ప్లూయిడ్స్‌ని ఎక్కించడం వల్ల బాక్టీరియా వంటి సూక్ష్మజీవులు చచ్చిపోతాయి. అంటే, ఈ ఫ్లూయిడ్ ఏ రకంగానూ బాక్టీరియాకు న్యూట్రియంట్ ఫ్లూయిడ్స్‌గా పనిచేయవు. గతంలో శ్రీ సత్యసాయిబాబాకు ఎంబామింగ్‌ చేస్తే ఇప్పుడు అదే ప్రక్రియను శ్రీదేవికి జరిపించారు.

Next Story