బ్రాండ్ హైదరాబాద్

బ్రాండ్ హైదరాబాద్
x
Highlights

ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలు, శాస్త్రజ్ఞుల దృష్టిని ఆకర్షించి అంతర్జాతీయ సదస్సులు నిర్వహించగలిగితే బ్రాండ్ వాల్యూ పెరిగినట్టే. హైదరాబాద్ విషయంలో...

ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలు, శాస్త్రజ్ఞుల దృష్టిని ఆకర్షించి అంతర్జాతీయ సదస్సులు నిర్వహించగలిగితే బ్రాండ్ వాల్యూ పెరిగినట్టే. హైదరాబాద్ విషయంలో ఇప్పుడు జరుగుతున్నది అక్షరాలా అదే. వరుసగా ఇంటర్నేషనల్ సమ్మిట్లకు వేదికవుతున్న భాగ్యనగరం.. విశ్వనగరంగా మారేందుకు వేగంగా అడుగులు వేస్తోంది.

400 ఏళ్ల చరిత్ర కలిగిన నగరం. డైనమిక్‌ సిటీల్లో ప్రపంచంలో ఐదో స్థానం. ఆధునికతను అందిపుచ్చుకుంటూనే టెక్నాలజీపరంగానే కాదు.. జీవన ప్రమాణాల విషయంలోనూ సరికొత్త ఒరవడి సృష్టిస్తోంది. విశ్వనగరమనే కీర్తి సంపాదించి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సదస్సులకు ఆతిధ్యం ఇస్తూ ప్రపంచదేశాలను రారమ్మంటూ ఆహ్వానిస్తోంది. రవాణా రూపురేఖల్ని మార్చే మెట్రో రైల్‌ను మణిహారంగా మార్చుకుని సగర్వంగా ఉనికి చాటుకుంటూ తెలంగాణ రాష్ట్రానికి ఓ బ్రాండ్ గా మారిపోయింది మన హైదరాబాద్‌.

ఇక ఈ నెలలోనే 2 అంతర్జాతీయ సదస్సులకు ఆతిథ్యం ఇచ్చిన హైదరాబాద్ మరో ప్రతిష్టాత్మక సమ్మిట్ కు సిద్ధమయింది. మైనింగ్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఫిక్కీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి 17 వరకు మైనింగ్‌ టుడే 2018 సదస్సు జరగగా, 18 నుంచి 21 వరకు వరల్డ్‌ ఐటీ కాంగ్రెస్‌కు హైదరాబాద్‌ వేదికయింది. ఇక మానవ పరిణామక్రమానికి మూలమైన కణంపై జరిగే బయో ఏషియా సమ్మిట్‌ నేటి నుంచి నుంచి 24 వరకు జరగనుంది. వెయ్యి మంది సైంటిస్టులు హాజరయ్యే ఈ సదస్సు నిర్వాహణకు చైనా సహా అనేక దేశాలు పోటీపడినా చివరకు హైదరాబాద్‌ ఈ అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుంది.

ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలు, శాస్త్రజ్ఞుల దృష్టిని ఆకర్షించి అంతర్జాతీయ సదస్సులు నిర్వహించగలిగితే బ్రాండ్ వాల్యూ పెరిగినట్టే. హైదరాబాద్ విషయంలో ఇప్పుడు జరుగుతున్నది అక్షరాలా అదే. వరుసగా ఇంటర్నేషనల్ సమ్మిట్లకు వేదికవుతున్న భాగ్యనగరం.. విశ్వనగరంగా మారేందుకు వేగంగా అడుగులు వేస్తోంది.

యావత్‌ భారతమే కాదు.. ప్రపంచ దేశాలు సైతం ఇప్పుడు హైదరాబాద్‌వైపే చూస్తున్నాయి. ఒకవైపు ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు, ఐటీ కాంగ్రెస్ వంటి అంతర్జాతీయ సమ్మిట్స్… మరోవైపు పట్టాలపై పరుగులు పెడుతున్న మెట్రో రైలు పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో మరోమైలు రాయిగా నిలుస్తోంది. సకల సౌకర్యాలతో అంతర్జాతీయ వేదికపై బ్రాండ్‌ హైదరాబాద్‌ మరోసారి సగర్వంగా తన ఉనికి చాటుకుంటోంది హైదరాబాద్. టెక్నాలజీ హబ్‌గా, స్టార్టప్‌ల వరప్రదాయినిగా, మెరుగైన జీవన ప్రమాణాలకు నిలయమైన భాగ్యనగరం.. ప్రభుత్వ చొరవతో విశ్వనగరం దిశగా దూసుకెళ్తోంది.

గతంలో ప్రపంచస్థాయి సదస్సులకు ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాలు మాత్రమే వేదికగా ఎంచుకునేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. హైదరాబాద్ బ్రాండ్‌ ఇమేజ్‌ కారణంగా ప్రపంచదేశాలన్నీ ఇప్పుడు భాగ్యనగరం వైపే చూస్తున్నాయి. ప్రపంచంలో టాప్‌ థర్టీ డైనమిక్‌ సిటీల్లో ఐదో స్థానంలో ఉన్న హైదరాబాద్ గ్లోబల్‌ సమ్మిట్‌లకు వేదికగా మారింది. సక్సెస్ ఫుల్ గా కార్యక్రమాలు పూర్తి చేస్తూ భాగ్యనగర కీర్తిని ప్రపంచ వ్యాప్తం చేస్తోంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాప్‌ – 11 సహా గత మూడేళ్లలో ఎన్నో ప్రపంచస్థాయి సదస్సులకు హైదరాబాద్‌ నగరం ఆతిధ్యమిచ్చింది. గ్లోబల్‌ ఎంట్రప్రెన్యూర్‌ సమ్మిట్‌కు సైతం వేదికగా మారడం భాగ్యనగర బ్రాండ్‌ ఇమేజ్‌ను మరింత పెంచింది. అన్ని రంగాల్లో గ్లోబల్‌ ఇన్వెస్టర్లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కలిసి చర్చించే అరుదైన అవకాశాన్ని హైదరాబాద్‌ నగరం కల్పించింది. అభివృద్ధిలో దూసుకుపోతున్న తీరు, ఆహ్లాదకరమైన వాతావరణం, కార్పొరేట్‌ హంగులతో మీటింగ్‌ హాళ్లు, చక్కటి ఆతిధ్యం అన్నింటినీ మించి భద్రత విషయంలో పూర్తి భరోసా హైదరాబాద్‌ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసింది.

హైదారాబాద్‌ కేంద్రంగా ఇప్పటికే 130కిపైగా అమెరికన్‌ కంపెనీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌, యాపిల్‌, ఫేస్‌బుక్‌, ఉబర్‌ వంటి సంస్థలు కోరి మరీ హైదరాబాద్‌ను డెస్టినేషన్‌గా ఎంచుకున్నాయి. ముఖ్యంగా ఐటీ, డిఫెన్స్‌, ఏరోనాటిక్స్‌, బయోటెక్‌, ఫార్మా రంగాల్లో హైదరాబాద్‌ దూసుకుపోతోంది. తాజాగా జరుగుతున్న సదస్సులతో ప్రపంచ దేశాలు హైదరాబాద్‌లో పెట్టుబడులకు ముందుకొచ్చే అవకాశాలు కోకొల్లలుగా ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories