ఓటుకు నోటు కేసు ఇన్నాళ్లు ఎందుకు ఆగింది?

ఓటుకు నోటు కేసు ఇన్నాళ్లు ఎందుకు ఆగింది?
x
Highlights

ఓటుకు నోటు కేసు రాజకీయంగా తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఈ వ్యవహారంలో ఉన్నారంటూ ఆరోపణలు రావడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ...

ఓటుకు నోటు కేసు రాజకీయంగా తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఈ వ్యవహారంలో ఉన్నారంటూ ఆరోపణలు రావడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఆడియో, వీడియో టేపులు బయటికి రావడంతో... ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ దుమారం చెలరేగింది. చంద్రబాబు, కేసీఆర్‌ మధ్య కొద్దిరోజు మాటల యుద్ధం కూడా నడిచింది. తెలుగు రాజకీయాలను ఓ కుదుపు కుదిపిన ఓటుకు నోటు కేసు ఇప్పుడు మళ్లీ రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. అసలీ కేసు దర్యాప్తు ఎక్కుడుందో ఒకసారి చూద్దాం.

ఓటుకు నోటు కేసులో ఇప్పటివరకూ రెండు ఛార్జిషీట్లు దాఖలయ్యాయి. 60 పేజీల్లో దాఖలుచేసిన అనుబంధ ఛార్జిషీట్లో కీలక అంశాలను ప్రస్తావించారు. తొలి ఛార్జిషీట్లో సమర్పించిన ఆడియోల్లోని గొంతులు ఒరిజనల్‌వేనంటూ ఫోరెన్సిక్ ఇచ్చిన రిపోర్ట్‌‌ను, ఆధారాలను కోర్టుకు సమర్పిస్తూ, రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్‌‌తోపాటు ఉదయ్‌ సిన్హాను నిందితులుగా పేర్కొంది. 2015 టీడీపీ మహానాడు కేంద్రంగా ఓటుకు నోటు వ్యవహారం సాగిందని, ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతను అప్పగించినట్లు ఛార్జిషీట్లో పేర్కొన్నారు.

అయితే ఛార్జిషీట్లలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రపై ఎక్కడా ప్రస్తావించకపోవడంతో.... వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ...సుప్రీంను ఆశ్రయించారు. ఛార్జిషీట్లు 52సార్లు చంద్రబాబు పేరు ప్రస్తావించిన ఏసీబీ.... ఎఫ్‌ఐఆర్‌ల్లో మాత్రం చేర్చలేదంటూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలో వద్దో ఏసీబీ కోర్టు నిర్ణయిస్తుందంటూ ఆర్కే పిటిషన్‌‌ను కొట్టివేయడంతో.... సుప్రీంలో సవాలు చేశారు. ఆర్కే పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.... వివరణ ఇవ్వాలంటూ చంద్రబాబుకి నోటీసులిచ్చింది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంలో పెండింగ్‌లో ఉండగా... కేసు దర్యాప్తు జరుగుతోందంటూ స్టేటస్‌ రిపోర్ట్‌ ఇచ్చింది ఏసీబీ. అయితే మూడేళ్లుగా స్తబ్ధుగా ఉన్న ఓటుకు నోటు కేసు ఫైల్‌ను దుమ్ముదులిపి... సడన్‌గా కేసీఆర్‌ సమీక్ష నిర్వహించడంతో మళ్లీ కలకలం రేగింది. నాలుగైదు గంటలపాటు ఈ కేసుపై సమీక్షించిన కేసీఆర్‌‌..... దర్యాప్తులో మరింత వేగం పెంచాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా... దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసు‌ను మళ్లీ తెరపైకి తేవడంతో.... రాజకీయంగానూ ఆసక్తి రేపుతోంది. ఈ కేసులో ఏపీ సీఎం చంద్రబాబుపైనా ఆరోపణలు రావడంతో.... ఈసారి ఊహించని సంచలనాలు నమోదవుతాయన్న టాక్‌ వినిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories