సోదరుడి మృతితో కన్నీరుమున్నీరైన హీరో విశాల్!

nanireddy
Updated on: 24 Dec 2018 1:26 PM IST
సోదరుడి మృతితో కన్నీరుమున్నీరైన హీరో విశాల్!
X

కష్టమొచ్చినా కన్నీళ్లొచ్చినా నేనున్నానంటూ ముందుకు వస్తాడు నటుడు విశాల్ అలాంటిది తాను ఇవాళ (మంగళవారం) అనుభవించిన బాధ అంతా ఇంతా కాదు.. ప్రముఖ నిర్మాత ఎస్. గోపాల్ రెడ్డి తనయుడు భార్గవ్ రెడ్డి అనుమానాస్పదంగా మరణించిన సంగతి తెలిసిందే..నిర్మాత గోపాల్ రెడ్డి విశాల్ తండ్రికి అన్న వరస అవుతాడు. అంటే విశాల్ కు భార్గవ్ రెడ్డి అన్న అవుతాడు. ఇక భార్గవ్ రెడ్డి మృతి చెందడంపట్ల ట్విట్టర్ లో స్పందించారు నటుడు విశాల్.. 'నీ జీవితాన్ని నివే ముగించుకొని ఉంటావని నేను అనుకోవడం లేదు. నా సొంత సోదరుడిని కోల్పోయాను. నా జీవతంలో ఇంత భావోద్వేగానికి నేను ఎప్పుడు గురి కాలేదు. నీకున్న సమస్యను నేను తెలుసుకోవలసి ఉండాల్సింది.నీ గురించి రాస్తున్నప్పుడు నా కంట కన్నీరు ఆగడం లేదు' అంటూ విశాల్ ట్వీట్ చేశాడు.

nanireddy

nanireddy

Next Story