కేసీఆర్‌ది ఆ రాశి అందుకే కలిసొస్తుంది : వేద పండితుడు

nanireddy
Updated on: 24 Dec 2018 2:44 PM IST
కేసీఆర్‌ది ఆ రాశి అందుకే కలిసొస్తుంది : వేద పండితుడు
X

తెలంగాణాలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు జోరు మీదున్నాయి. ఎవరికి తోచింది వారు మాట్లాడుకుంటున్నారు. ఎన్నికల కోసమే అంటూ కొందరు విభజన హామీల కోసమేనని మరికొందరు ఇలా ఎవరి అభిప్రాయాలు వారివి. ఎవరి అంచనాలు వారివి. ఏమైనా సీఎం ఢిల్లీ టూర్ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. ఇక కేసీఆర్ నిర్ణయం సరైందేనని, ఆయన జాతక రీత్యా మంచి యోగం కనిపిస్తుందంటున్నారు వేద పండితుడు సూర్యనారాయణ. కేసీఆర్‌ది కర్కాటక రాశి అని, ఆయనకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రజాదరణ పొందడానికి, రాజ్యబలం పెంచుకోవడానికి అనుకూలంగా ఉందంటున్నారు. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో ఆయన ముందస్తు ఎన్నికలకు వెళితే అన్నివిధాలా కలిసొస్తుందంటున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలంటే రాశుల బలాలు మారిపోయే అవకాశం ఉందని చెప్పారు.

nanireddy

nanireddy

Next Story