అసభ్యకర ఫోటోల మార్ఫింగ్ అతని పనే : రాంగోపాల్ వర్మ
పలువురు యువతుల ఫోటోలను మార్ఫింగ్ చేసి వాటికీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తలను అతికించి సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడమే పనిగా పెట్టుకున్న జయకుమార్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వర్మ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని పట్టుకున్నారు. రెండు సంవత్సరాల క్రితం రాంగోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేరారు జయకుమార్ అయితే కొద్ది కాలానికే వర్మ అతన్ని పనిలోనుంచి తీసేశాడు. దీంతో కక్ష గట్టాడు. ఈ క్రమంలో యువతుల అసభ్యకర చిత్రాలకు రాంగోపాల్‌వర్మ తలను పెట్టి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడమే కాకుండా.. అసభ్యకరంగా కామెంట్లు పెట్టాడు. ఇది అతని పనేనని గ్రహించిన వర్మ అతనిపై ఫిర్యాదు చేశాడు.
Next Story




