సెక్స్‌ రాకెట్‌ కేసులో నటి సంగీత అరెస్ట్‌

సెక్స్‌ రాకెట్‌ కేసులో నటి సంగీత అరెస్ట్‌
x
Highlights

సెక్స్‌ రాకెట్‌ కేసులో సీనియర్‌ నటి సంగీత అరెస్ట్‌ అయ్యారు. కొన్ని రోజులుగా ఓ రిసార్ట్ ను కేంద్రంగా చేసుకుని సెక్స్‌ రాకెట్‌ ముఠాను నిర్వహిస్తున్నారు...

సెక్స్‌ రాకెట్‌ కేసులో సీనియర్‌ నటి సంగీత అరెస్ట్‌ అయ్యారు. కొన్ని రోజులుగా ఓ రిసార్ట్ ను కేంద్రంగా చేసుకుని సెక్స్‌ రాకెట్‌ ముఠాను నిర్వహిస్తున్నారు ఆమె. అజ్ఞాత వ్యక్తి ఫిర్యాదుమేరకు వ్యభిచార స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో చాలామంది విటులతోపాటు కొంతమంది మహిళా జూనియర్ ఆర్టిస్ట్ లు పట్టుబడ్డారు. నటి సంగీత, ఆమె సన్నిహితుడు సురేశ్‌ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా.. ధర్మాసనం వీరికి కస్టడీ విధించింది. ఈ ఘటనతో తమిళ సినీవర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. కాగా నటి సంగీత.. 'కరుప్పు రోజా' అనే తమిళ చిత్రంతో తెరంగ్రేటం చేశారు. అనంతరం పలుచిత్రాల్లో కీలకపాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఆమె కొన్ని సీరియల్స్ లో నటిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories