ఉదయ్‌కిరణ్‌ బయోపిక్‌?

ఉదయ్‌కిరణ్‌ బయోపిక్‌?
x
Highlights

ఈ మధ్య కాలంలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది.. ఇప్పటికే అలనాటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' సినిమా వచ్చి సూపర్ హిట్ అయింది.....

ఈ మధ్య కాలంలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది.. ఇప్పటికే అలనాటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' సినిమా వచ్చి సూపర్ హిట్ అయింది.. ఇప్పుడు ఇదే స్పూర్తితో దర్శకుడు తేజ దివంగత హీరో జీవిత చరిత్రను బయోపిక్ రూపంలో తెరకెక్కించనున్నాడు.. ఉదయ్‌కిరణ్‌ ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకువచ్చేది 'లవర్ బాయ్'..." చిత్రం" సినిమాతో వైవిధ్యభరిత లవ్ కధలకు శ్రీకారం చుట్టారు దర్శకుడు తేజ , ఉదయ్ కిరణ్ లు ఆ సినిమాతో లవ్ అనే పదానికి కొత్త ట్రెండ్ వచ్చిందనే చెప్పాలి. ఆ తరువాత అదే కాంబినేషన్ లో వచ్చిన 'నువ్వు నేను' సినిమా కమర్షియల్ గా మంచి హిట్ సాధించడమే కాకుండా ఉదయ్ కిరణ్ కు నట జీవితాన్నిచ్చిందనే చెప్పాలి.. ఆ తరువాత ఐదేళ్లపాటు వెనక్కితిరిగి చూసుకోలేదు ఉదయ్.. ఆలా ఆలా.. నాలుగేళ్లు కానికిచ్చేసిన ఉదయ్ కష్టాల్లో పడ్డాడు వరుసప్లాపులతో సతమతమవుతున్న తరుణంలో 'ఔనన్నా కాదన్నా' చిత్రంతో ఉదయ్ కిరణ్ కు మళ్ళీ లైఫ్ ఇచ్చాడు తేజ. ఈ ఐదేళ్ల మధ్యలో ప్లాపులతో ఉదయ్ ఎదుర్కున్న కష్టాలు సినీ అవకాశాలు లేక ఇబ్బందిపడ్డ క్షణాలను ముక్యంగా ఆ తరువాత జరిగిన పరిణామాలు సినిమాల్లోకి రావడానికి ముందు ఉదయ్ పడ్డ బాధలు అన్నిటిని ఓ బయోపిక్ రోపంలో చూపించనున్నాడు తేజ..దీనికి 'కాబోయిన అల్లుడు' అనే టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించాడని టాక్ వినబడుతోంది.. ప్రముఖ సినీ కుటుంబంతో ఉదయ్‌కిరణ్‌ కుటుంబం వియ్యానికి సిద్ధమవడం, ప్రముఖ హీరోకి అల్లుడు కాబోయి వివాదాల కారణంగా ఆ పెళ్లి రద్దు కావడం వంటి అంశాలు ఈ బయోపిక్ లో వుండే అవకాశం కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories