2,786 పోస్టులకు ఐదు నోటిఫికేషన్లు

2,786 పోస్టులకు ఐదు నోటిఫికేషన్లు
x
Highlights

తెలంగాణలో కొలువుల జాతర మొదలైంది. వివిధ శాఖల్లో గ్రూప్ 4, వీఆర్‌ఓ, ఏఎస్‌వో పోస్టులకు సంబంధించి 2,786 పోస్టుల భర్తీకి సంబంధించి ఐదు నోటిఫికేషన్లను...

తెలంగాణలో కొలువుల జాతర మొదలైంది. వివిధ శాఖల్లో గ్రూప్ 4, వీఆర్‌ఓ, ఏఎస్‌వో పోస్టులకు సంబంధించి 2,786 పోస్టుల భర్తీకి సంబంధించి ఐదు నోటిఫికేషన్లను విడుదల చేసింది టీఎస్‌పీఎస్సీ. ఈ పోస్టులను డిసెంబరు నాటికి భర్తీ చేస్తామని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కానుకగా టీఎస్‌పీఎస్సీ 2,786 పోస్టులతో ఐదు ఉద్యోగ ప్రకటనలు విడుదల చేసింది. వీటిలో కీలకమైన గ్రూప్‌-4, వీఆర్‌వోతో పాటు సీనియర్‌ స్టెనో, ఆర్టీసీ, అర్థగణాంక శాఖల నోటిఫికేషన్లు ఉన్నాయి. కిందిస్థాయి ఉద్యోగాలైన వీటికి నిరుద్యోగ యువత నుంచి పోటీ అధికంగా ఉంటుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తూ, ప్రాథమిక పరీక్షల షెడ్యూలు కమిషన్‌ ఖరారు చేసింది.

అత్యధికంగా గ్రూప్‌-4లో 1,521 పోస్టులు, రెవెన్యూలో 700 వీఆర్‌వో, అర్థగణాంకశాఖలో 474 మండల ప్రణాళిక, గణాంక అధికారులు, సహాయ గణాంక అధికారుల పోస్టులు ఉన్నాయి. వీఆర్‌వో పోస్టులను పూర్వజిల్లా ప్రాతిపదికన భర్తీ చేయనుంది. మండల ప్రణాళిక, గణాంక అధికారుల పోస్టులు జోనల్‌ విధానంలో ఉంటాయి. కొత్తగా ఇచ్చిన ఉద్యోగ ప్రకటనలకు ఈనెల 7 నుంచి నోటిఫికేషన్ల వారీగా దరఖాస్తులను ఆన్‌లైన్లో స్వీకరించనుంది.

అయితే, టీఎస్‌పీఎస్పీకి అప్పగించిన ఉద్యోగాలతో కలిపి 35 వేల నుంచి 40వేల పోస్టులను డిసెంబరు నాటికి పూర్తి చేస్తామని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. మూడేళ్లలో 32వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వగా..12వేలు భర్తీ చేశామన్నారు. మరో 15వేల ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు పూర్తైనట్టు తెలిపారు. పరీక్షల్లో ప్రతిభ, జిల్లా స్థానికత, అభ్యర్థి ఇచ్చిన ఆప్షన్ల మేరకు పోస్టింగులు ఉంటాయని కమిషన్‌ వర్గాలు వెల్లడించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories