కౌగిలించుకున్న ట్రంప్‌- కిమ్‌!

nanireddy
Updated on: 24 Dec 2018 1:41 PM IST
కౌగిలించుకున్న ట్రంప్‌- కిమ్‌!
X

ప్రపంచ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం. అసాధ్యమనుకున్నది సుసాధ్యమయ్యింది. ఆజన్మ శత్రువులుగా.. ఇంతకాలం... ఉప్పూ నిప్పూగా .. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న అమెరికా.. ఉత్తర కొరియాలు.. స్నేహగీతం పాడాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌... నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌లు సింగపూర్‌లో సమావేశమయ్యారు. షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకుని ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. అనంతరం ఏకాంతంగా సమాలోచనలు జరుపుతున్నారు.మంగళవారం ఉదయం ఈ భేటీలో ఈ ఇద్దరు నేతల తోపాటు ఇరుదేశాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉత్తర కొరియాను అణునిరాయుధీకరణకు ఒప్పించడమే ప్రధాన ఎజెండాగా సింగపూర్‌లోని కపెల్లా హోటల్లో అమెరికా, ఉ.కొరియా అధినేతల మధ్య ఈ శిఖరాగ్ర సమావేశం జరిగింది.

nanireddy

nanireddy

Next Story