Top
logo

టీఆర్‌ఎస్‌-బీజేపీ మధ్య కాపీ వార్‌

టీఆర్‌ఎస్‌-బీజేపీ మధ్య కాపీ వార్‌
X
Highlights

తెలంగాణ ప్రభుత్వ పథకాలను బీజేపీ కాపీ కొట్టిందన్న మంత్రి కేటీఆర్ ట్వీట్‌పై రగడ జరుగుతోంది. కేసీఆర్‌ అమలు...

తెలంగాణ ప్రభుత్వ పథకాలను బీజేపీ కాపీ కొట్టిందన్న మంత్రి కేటీఆర్ ట్వీట్‌పై రగడ జరుగుతోంది. కేసీఆర్‌ అమలు చేస్తోన్న స్కీమ్స్‌ను కర్నాటక బీజేపీ మేనిఫెస్టోలో కాపీ... పేస్ట్‌ చేశారన్న కామెంట్స్‌పై మండిపడుతున్నారు. బీజేపీ పథకాలనే టీఆర్‌ఎస్‌ కాపీ కొట్టిందంటూ కౌంటరిస్తున్న కమలనాథులు... ప్రతి రాష్ట్రంలోనూ పేర్లు మార్చుకొని ఆయా పథకాలను ప్రవేశపెట్టడం సర్వసాధారణమేనంటూ తేలిగ్గా తీసుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య కాపీ వార్‌ నడుస్తోంది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలను కర్నాటక బీజేపీ యథాతథంగా కాపీ కొట్టిందంటూ మంత్రి కేటీఆర్‌‌ ట్వీట్‌ చేశారు. మిషన్‌ కాకతీయను మిషన్‌ కళ్యాణిగా, కల్యాణలక్ష్మిని వివాహ మంగళ యోజనగా, టీ-హబ్‌లాగా కే-హబ్‌, చేనేత రుణాల మాఫీ, ఐపాస్‌ తరహా స్కీమ్‌, అన్నపూర్ణ క్యాంటీన్స్‌ ఇలా అనేక తెలంగాణ పథకాలను కర్నాటక బీజేపీ మేనిఫెస్టోలో కాపీ...పేస్ట్‌ చేశారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తోన్న పథకాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయనడానికి ఇదే నిదర్శనమన్న కేటీఆర్‌‌... ఇకనైనా బీజేపీ నేతలు.... టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు మానుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలను బీజేపీ కాపీ కొట్టిందన్న కేటీఆర్‌‌ కామెంట్స్‌పై కమలనాథులు మండిపడుతున్నారు. బీజేపీ పథకాలనే టీఆర్‌ఎస్‌ కాపీ కొట్టిందన్న బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు.... ప్రతి రాష్ట్రంలోనూ పేర్లు మార్చుకొని ఆయా పథకాలను ప్రవేశపెట్టడం సర్వసాధారణమన్నారు. మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌పై బీజేపీ నేతలతోపాటు కొందరు నెటిజన్లు కూడా సెటైర్లు వేస్తున్నారు. కర్నాటక బీజేపీ మేనిఫెస్టోలో తెలంగాణ పథకాలున్నాయని భలే పట్టేశారు సార్‌ అంటూ వ్యంగ్యస్త్రాలు విసురుతున్నారు.

Next Story