మాజీ ఎంపీ. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మృతి

nanireddy
Updated on: 24 Dec 2018 2:41 PM IST
మాజీ ఎంపీ. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మృతి
X

మాజీ ఎంపీ. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాణిక్‌రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను.కుటుంబ సభ్యులు ప్రముఖ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే... పరిస్థితి విషమించి నేడు(ఆదిమవారం) తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. మాణిక్‌రెడ్డి ఓ పర్యాయం ఎంపీగా పనిచేసిన మాణిక్‌రెడ్డి అనంతరం మారిన రాజకీయ సమీకరణాల రీత్యా టీఆర్ఎస్ లో చేరారు. కాగా అయన మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. పలువురు రాజకీయ నేతలు అయన మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన స్వగ్రామమైన ఆందోల్ మండలం డాకూర్ లో నేడు అంత్యక్రియలు జరుగనున్నాయి.

nanireddy

nanireddy

Next Story