పవన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ

పవన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ
x
Highlights

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మధ్య రహస్య ఒప్పందం...

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మధ్య రహస్య ఒప్పందం ఉందన్న కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు. పవన్‌ ను తాము రాజకీయ నేతగా చూడటం లేదన్నారు. సినీ నటుడిగానే పవన్‌ కల్యాణ్‌.. కేసీఆర్‌ను కలిశారని స్పష్టం చేశారు. పవన్ తన సినిమా (అజ్ఞాతవాసి) కు ఐదు షోల అనుమతి కోసం సీఎం కేసీఆర్‌ను కలిశారని కర్నె అన్నారు. పవన్‌తో రహస్య ఒప్పందం పెట్టుకునేంత బలహీనంగా టీఆర్‌ఎస్‌ లేదని ఆయన పేర్కొన్నారు. పవన్‌ కల్యాణ్ సీజనల్‌ నేతని, ఆయన వల్ల లాభం లేదు, నష్టం లేదని కర్నె ప్రభాకర్ అన్నారు. పవన్‌ పర్యటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. పవన్‌ పూర్తిస్థాయి నేతగా మారి యాత్ర చేస్తే ఆల్‌ ది బెస్ట్‌ అని కర్నె చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories