రాజకీయ సన్యాసం తీసుకుంటా : టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలనం..

nanireddy
Updated on: 24 Dec 2018 1:56 PM IST
రాజకీయ సన్యాసం తీసుకుంటా : టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలనం..
X

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పైగా టీఆర్ఎస్ అధిష్ఠానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. మేయర్ పై అవిశ్వాసం విషయంలో.. తన మాటను అధిష్ఠానం లెక్కచేయకపోవడాన్ని తప్పుపట్టారు. అవినీతి పరులను అధిష్ఠానం ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. క్రమశిక్షణ లోపించిన పార్టీలో తాను ఉండలేనని రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు.

nanireddy

nanireddy

Next Story