మూసీ కాల్వలో ఘోర ప్రమాదం.. 15 మంది దుర్మరణం!

nanireddy
Updated on: 24 Dec 2018 1:48 PM IST
మూసీ కాల్వలో ఘోర ప్రమాదం.. 15 మంది దుర్మరణం!
X

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేములకొండ సమీపంలోని మూసీ కాలువలో వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది వరకూ మృతి చెందారు. మూసీ కాల్వ గట్టు మీద నుంచి వెళ్తున్న ట్రాక్టర్‌.. ఒక్కసారిగా అదుపుతప్పి మూసీ పంట కాల్వలోకి బోల్తా పడింది. ట్రాక్టర్‌లో 30 మంది వరకూ కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. కాల్వ లోతు తక్కువగానే ఉన్నా.. ట్రాక్టర్ ట్రాలీ తిరగపడటంతో అందులో చిక్కుకుని ఊపిరాడక చనిపోయారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది మహిళా కూలీలే ఉన్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు.

nanireddy

nanireddy

Next Story